Begin typing your search above and press return to search.

పింక్ లో ప‌రిమ‌ళించిన 'దేవ‌ర' బ్యూటీ!

చీరందంలో జాన్వీక‌పూర్ బ్యూటీని వ‌ర్ణించ‌డం అంత వీజీకాదు. అమ్మ‌డు చీర చుట్టిందంటే? ఆ చీర‌కే వ‌న్నె తెచ్చేస్తుంది

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:57 PM GMT
పింక్ లో ప‌రిమ‌ళించిన దేవ‌ర బ్యూటీ!
X

చీరందంలో జాన్వీక‌పూర్ బ్యూటీని వ‌ర్ణించ‌డం అంత వీజీకాదు. అమ్మ‌డు చీర చుట్టిందంటే? ఆ చీర‌కే వ‌న్నె తెచ్చేస్తుంది. చీర‌కున్న ప్ర‌త్యేక‌త‌కు జాన్వీ లాంటి అందం తోడైదంటే? అది వ‌ర్ణ‌తాతీమే. తాజాగా క‌పూర్ బ్యూటీ మరోసారి అంత‌టి అందంతో మ‌త్తెక్కించే ప‌నిలో ప‌డింది. ఇదిగో ఇక్క‌డిలా పింక్ వ‌ర్ణంలో త‌ళుకులీనింది. మ్యాచింగ్ షోల్డెర్ లెస్ ర‌విక ధ‌రించి ఆహా ఈ అందం చూడ‌త‌ర‌మా? అనిపిస్తుంది.


అమ్మ‌డి అల‌కంక‌ర‌ణ ప్ర‌తీది జాన్వీని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. నెక్ పై డిజైన‌ర్ నెక్లెస్.. పెదాల‌కి అద్దిన లిప్ స్టిక్..నుదిటిన గ్రీన్ క‌ల‌ర్ పావ‌లా బిళ్లంత బొట్టు..రింగులు తిరిగిన హెయిర్ స్టైల్ తో జాన్వీ మ‌త్తులో దించేస్తుంది. లేలేత సోయ‌గం చీరందంలో కుర్రాళ్ల‌ని ఛిద్రం చేసేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ రోజు కోల్ క‌త్తా కే అందం వ‌చ్చేసిందంటూ ఓ నెటిజ‌నుడు కామెంట్ పోస్ట్ చేసాడు.


అమ్మ‌డు అక్క‌డికి ఓ ప్ర‌మోష‌నల్ ఈవెంట్ లో భాగంగా హాజ‌రైంది. ఇక అమ్మ‌డి అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ కుర్రాళ్ల‌లో క‌విత్వాలు త‌న్నుకొస్తున్నాయి. ఊహ‌కి అంద‌ని అందం నీ సొంతం అంటూ ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ ల‌క్ష‌ల్లో వంద‌ల్లో క‌నిపిస్తున్నాయి. మ‌రి అతిలోక సుంద‌రి అంద‌మా? మ‌జాకానా? ఇక జాన్వీ కెరీర్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ ని ప‌రుగులు పెట్టిస్తుంది.

'దేవ‌ర' త‌ర్వాత టాలీవుడ్ లో మ‌రింత బిజీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందు కొత్త అవ‌కాశాలు వ‌రుస‌లో ఉన్నాయి. మ‌హేష్ ..రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ కి జోడీగా జాన్వీ ప‌ర్పెక్ట్ అంటున్నారు. బాలీవుడ్ లో ఎదిగే క్ర‌మంలోనే ఛాలెంజింగ్ రోల్స్ సైతం స్వీక‌రిస్తుంది. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు చేస్తూనే! సోలోగానూ ఐడెంటెటీ వేయాల‌ని చూస్తోంది.