Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి కంటే జాన్వీ పారితోషికం అన్ని రెట్లు ఎక్కువ‌!

అతిలోక సుంద‌రి శ్రీదేవి ద‌క్షిణాదిన వెండి తెర‌కు ప‌రిచ‌య‌మై, అగ్ర నాయిక‌గా ఏల‌డ‌మే గాక‌, అటుపై ఉత్త‌రాదినా నంబ‌ర్ వ‌న్ తార‌గా వెలుగొందారు

By:  Tupaki Desk   |   2 Dec 2023 1:52 AM GMT
శ్రీ‌దేవి కంటే జాన్వీ పారితోషికం అన్ని రెట్లు ఎక్కువ‌!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ద‌క్షిణాదిన వెండి తెర‌కు ప‌రిచ‌య‌మై, అగ్ర నాయిక‌గా ఏల‌డ‌మే గాక‌, అటుపై ఉత్త‌రాదినా నంబ‌ర్ వ‌న్ తార‌గా వెలుగొందారు. శ్రీ‌దేవి త‌న‌ మొదటి తమిళ చిత్రంలో పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో న‌టించారు. ఆ సినిమాకి శ్రీ‌దేవి అందుకున్న పారితోషికంతో పోలిస్తే, ఇప్పుడు త‌న న‌టవార‌సురాలు జాన్వీ క‌పూర్ తెలుగు అరంగేట్రం `దేవర` కోసం కొన్ని రెట్లు అధిక పారితోషికం అందుకుంటున్నారు. నాటి కాలంతో పోలిక చూడ‌టం స‌రికాదు.. కానీ ఫీజులో భారీ వ్యత్యాసం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

అతిలోక సుంద‌రి శ్రీదేవి దేశంలోని అతిపెద్ద సూపర్‌స్టార్‌లలో ఒకరిగా ద‌శాబ్ధాల పాటు కొన‌సాగారు. దివంగత నటి కూడా త‌న‌ కాలంలో అత్యధిక పారితోషికం పొందిన క‌థానాయిక‌ల్లో ఒకరిగా పాపుల‌రయ్యారు. అయితే సూపర్‌స్టార్‌లు రజనీకాంత్, కమల్ హాసన్‌లతో తన మొదటి తమిళ చిత్రానికి (నాయకుడిగా) చెల్లించిన పారితోషికం గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ మూండ్రు ముడిచులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌డానికి శ్రీ‌దేవికి కేవలం రూ. 5000 మాత్రమే చెల్లించారు. ఈ చిత్రానికి K బాలచందర్ దర్శకత్వం వ‌హించారు. ఆయ‌నే రచయిత‌. శ్రీ‌దేవి కేవలం 13 ఏళ్ల వయస్సు(టీనేజ‌ర్ గా)లో మొదటి ప్రధాన పాత్ర ఇది! అయితే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం, జూనియర్ ఎన్టీఆర్ నటించిన `దేవర`తో పోల్చితే శ్రీదేవికి మొదటి చిత్రానికి చెల్లించిన ఫీజు ప‌రిగ‌ణించ‌ద‌గిన‌దేనా? ఒక ప్ర‌ముఖ‌ క‌థ‌నం ప్ర‌కారం.. జాన్వీ తన సౌత్ అరంగేట్రానికి రూ.3.5 కోట్లు వసూలు చేస్తోంది. శ్రీదేవి డెబ్యూ ఫీజుతో పోలిస్తే ఈ డిఫ‌రెన్స్ కు ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

జాన్వీ తన తెలుగు సినిమా దేవర కోసం అందుకుంటున్న మొత్తం.. కొన్నేళ్ల క్రితం త‌న‌ తల్లి శ్రీ‌దేవికి చెల్లించిన దానికంటే 6,99,900 శాతం ఎక్కువ అని విశ్లేషిస్తున్నారు! ఆసక్తికరంగా.. జాన్వీ కపూర్ హిందీ అరంగేట్రం ధ‌డ‌క్ కోసం కూడా `మూండ్రు ముడిచు`కి శ్రీదేవి ఫీజు కంటే చాలా రెట్లు ఎక్కువ.

హిందీ డెబ్యూ ధడక్ కోసం జాన్వీ కపూర్ ఫీజు

జాన్వీ కపూర్ తన హిందీ తొలి చిత్రం ధడక్ కోసం 60 లక్షలు అందుకోగా, శ్రీదేవి తొలి పారితోషికం కంటే దాదాపు 1,19,900 శాతం ఎక్కువ. జాన్వీ ధడక్ సినిమాతో హిందీలో అడుగుపెట్టగా, శ్రీదేవి 1975లో జూలీతో హిందీలో అరంగేట్రం చేసింది. శ్రీ‌దేవి కెరీర్ ఉత్త‌మ‌ అరంగేట్రం 1979లో సోల్వా సావన్‌తో కుదిరింది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

శ్రీదేవి - అత్యధిక పారితోషికం తీసుకునే నటి!

శ్రీ‌దేవితన వరుస హిట్‌లతో బాక్స్-ఆఫీస్ వ‌ద్ద‌ సూపర్ స్టార్ హోదాను పొందింది. పురుష వేత‌నంతో సమాన వేతనం డిమాండ్ చేసిన మొదటి నటిగా కూడా రికార్డుల‌కెక్కింది. నిజానికి, 1 కోటి పారితోషికం కూడా డిమాండ్ చేసిన మొదటి నటి. ప్రేక్షకుల్లో గొప్ప‌ పట్టు ఇమేజ్ ఉంది కాబట్టి, శ్రీ‌దేవి కోట్ చేసిన పారితోషికాన్ని నిర్మాత‌లు చెల్లించారు.

జాన్వీ కపూర్ ఫీజు తగ్గింది!

జాన్వీ కపూర్ విషయానికి వస్తే, ఈ బ్యూటీ కేవలం 60 లక్షల ఫీజుతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఒక్కో ప్రాజెక్ట్‌కు 6 కోట్లు వసూలు చేస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ వరుస ఫ్లాప్‌లతో ఈ బ్యూటీ తన ఫీజును తగ్గించుకుంది. నితేష్ తివారీ బావాల్ కోసం జాన్వీ కపూర్ కు 3 కోట్లు చెల్లించార‌న్న టాక్ కూడా ఉంది.

కాబట్టి, శ్రీదేవి అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా స్థానాన్ని కైవసం చేసుకునే స‌మ‌యానికి ఆమె జీతం దాదాపు 2000 రెట్లు పెరిగింది. త‌న‌ మొదటి రుసుము 5000 నుండి 90లలో సినిమాలకు 1 కోటి పొందింది. అయితే 60 లక్షల నుండి దేవరతో 3.5 కోట్లకు ఎద‌గ‌డం వరకు జాన్వీ కపూర్ ఫీజు కేవలం 5.8 రెట్లు పెరిగింది.

అభిన‌య‌నేత్రి శ్రీ‌దేవి వేసిన దారిలో నడవడం చాలా కష్టం. కానీ జాన్వీ నెమ్మదిగా స్థిరంగా అత్యుత్త‌మ స్థానానికి చేరుకుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..తదుపరి మిస్టర్ అండ్ మిసెస్ మహిలో న‌టించింది. తెలుగు తొలి చిత్రం `దేవర`లో న‌టిస్తోంది.