Begin typing your search above and press return to search.

దివాలీ కాంతుల్లో అమ్మ ఇంట్లో తిరుగుతున్న‌ట్లే!

మ‌రి ఈసారి దివాలీని 'దేవ‌ర' బ్యూటీ జాన్వీ క‌పూర్ ఎలా ప్లాన్ చేస్తుందో? ఆమె మాట‌ల్లోనే..

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:54 AM GMT
దివాలీ  కాంతుల్లో అమ్మ ఇంట్లో తిరుగుతున్న‌ట్లే!
X

దివాలీ అంటే బాలీవుడ్ లో ఎంతో స్పెష‌ల్. అక్క‌డ హీరోలు-హీరోయిన్లు అంతా ఒకే చోట క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుం టారు. ముఖ్యంగా ఆ రోజు బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ ఇంట అతిధులైపోతారంతా. స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా ఆయ‌న ఇంట్లో గేద‌ర్ అవుతుంటారు. మరికొంత మంది క‌ర‌ణ్ జోహార్ ఇంట వేడుక‌కు హాజ‌ర‌వుతుంటారు. ఇది ప్ర‌తీ ఏడాది క్ర‌మం త‌ప్ప‌కుండా జ‌రుగుతుంది. అయితే టాలీవుడ్ హీరోలు అలా కాదు. ఎవ‌రి ఫ్యామిలీ తో వారే వాళ్ల ఇళ్ల‌లో సెల‌బ్రేట్ చేసుకుంటారు. మ‌రి ఈసారి దివాలీని `దేవ‌ర` బ్యూటీ జాన్వీ క‌పూర్ ఎలా ప్లాన్ చేస్తుందో? ఆమె మాట‌ల్లోనే..


`అమ్మకి తెలుగు సంప్ర‌దాయాలు, పండుగ‌లు అంటే ఎంతో ఇష్టం. పండ‌గొచ్చిందంటే అన్నిర‌కాల పిండి వంట‌లు చేసేది. దీపావ‌ళి రోజున అంద‌మైన ముగ్గులు కూడా వేసేది. సాయంత్రం అయితే దీపాల‌తో ఎంతో అందంగా అలంక‌రించేది. ప‌ట్టు లంగావోణీ వేసుకుని నేను, చెల్లి ఇల్లంతా తిరిగేవాళ్లం. అయితే అమ్మ చ‌నిపోయాక ఆ వేడుక‌ల‌కు దూరం అయ్యాం. దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేయ‌డం మానేసాం.

అయితే అమ్మ‌గుర్తుగా మేము ఉండాల‌ని ఈ మ‌ధ్య‌నే నిర్ణ‌యించుకున్నాం. అమ్మ బాధ్య‌లు ఇప్పుడు మేం తీసుకుని పండ‌గ‌లు చేస్తున్నాం. దీపావ‌ళి రోజున మ‌తాబులు కాలుస్తాం. బంధువుల‌ను ఇంటికి ఆహ్వానించి వాళ్ల‌కు భోజ నాలు, పిండి వంట‌లు వ‌డ్డించి వాళ్ల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తాం. అలా చేస్తుంటే అమ్మ ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మ జ్ఞాప‌కాలు నెమ‌ర వేసుకుంటాం.

ఆరోజు మ‌న‌సుకు బాధ‌గా ఉంటుంది. గుండె బ‌రువెక్కుతుంది. కానీ ఆ రోజు ముగింపు మాత్రం ఎంతో సంతోషంగా గ‌డుస్తుంది` అని తెలిపింది. దేవ‌ర సినిమాతో జాన్వీ టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే అమ్మ‌డు భారీ పాన్ ఇండియా స‌క్స‌స్ అందుకుంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది.