బోయ్ ఫ్రెండ్ ఉంటే ప్రతిరోజూ దీపావళే.. జాన్వీని చూసారా?
అయితే సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న ఫోటోగ్రాఫ్స్ లో జాన్వీ భిన్నమైన అవతార్ లలో కనిపించింది.
By: Tupaki Desk | 2 Nov 2024 6:15 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా గురువారం ముంబైలోని వెర్సోవాలోని బోనీ కపూర్ కార్యాలయంలో దీపావళి పూజకు హాజరయ్యారు. ఒకే కారులో కలిసి రావడం, వేదిక వద్ద సందడి చేయడం, ఓచోట ఒంటరి ప్రదేశంలో ఈ జంట హాయిగా సేదదీరడం, పెట్స్ తో ఆడుకోవడం వగైరా దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న ఫోటోగ్రాఫ్స్ లో జాన్వీ భిన్నమైన అవతార్ లలో కనిపించింది.
ప్రతిచోటా ఈ యువజంట హైలైట్ గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరూ కలిసి కెమెరాలకు ఫోజులిచ్చేందుకు తమ ప్రేమను బహిరంగపరిచేందుకు ఎప్పుడూ వెనకాడడం లేదు. చాలా ఫోటోలలో జాన్వీతో పాటు శిఖర్ కనిపిస్తున్నాడు. ఈవెంట్లో జాన్వీ పాస్టెల్ చీరలో దర్శనమిచ్చారు. ఇందులో మింట్ గ్రీన్ .. బ్లష్ పింక్ షేడ్స్ తో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఈ కొత్త లుక్ పండగ వాతావరణం తెచ్చింది. ఎంపిక చేసుకున్న డిజైనర్ శారీకి తగ్గట్టుగానే అందమైన ఆభరణాలను జాన్వీ ధరించింది. ఇక శిఖర్ చాలా ఫోటోగ్రాఫ్స్ లో జాన్వీ వెంటే కనిపించాడు. అతడు సాంప్రదాయానికి తగ్గ దుస్తులలో స్మార్ట్‌గా కనిపించాడు. ఖుషీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి వెన్యూ వద్దకు వచ్చారు. పండగ థీమ్ కి తగ్గట్టే బోనీ, ఖుషీ గెటప్ లు ఆకట్టుకున్నాయి.
జాన్వీ - ఖుషీ ఇటీవల మాల్దీవుల వెకేషన్ నుండి తిరిగి వచ్చారు. వెకేషన్ లో శిఖర్, ఖుషీ బోయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనా కూడా కనిపించారు. ఈ యాత్ర నుంచి జంటల ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఖుషీ వెకేషన్స్ నుంచి అద్భుతమైన బికినీ ఫోటోలను షేర్ చేయగా వెబ్ ని షేక్ చేసాయి.
దీపావళి వేళ జంటలను చూశాక.. అందరిలో కొన్ని సందేహాలు. జాన్వీ- శిఖర్ మధ్య ప్రేమాయణం గురించి ప్రతిదీ బహిరంగమే. కానీ ఖుషీ - వేదాంగ్ల డేటింగ్ వ్యవహారంపై పూర్తి స్పష్ఠత రావాల్సి ఉంది. ఈ అందమైన జంట గురించి బోనీ ఇంకా ఏదీ ప్రకటించలేదు. కానీ జాన్వీ స్నేహితుడు శిఖర్ ఎప్పుడూ తమ చుట్టూ ఉంటే అది తమ కుటుంబానికి ఆనందాన్నిస్తుందని బోనీ ఇంతకుముందు అన్నాడు. దీంతో జాన్వీ- శిఖర్ జంట ప్రేమాయణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంతా భావించారు.