జాన్వీ అంటే ప్లానింగ్..ప్లానింగ్ అంటే జాన్వీ!
ఇటీవల చిట్ చాట్ బిగ్ కమర్శియల్ సినిమాల్లో నటించకపోవడం పై స్పందించింది. అందులో ఏమందంటే?
By: Tupaki Desk | 25 July 2024 5:30 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్..టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ఈ రకమైన ఛాన్సులు అందు కోవడం మామ్ ఇమేజ్ కీలక పాత్ర పోషించింది అన్నది వాస్తవం. జాన్వీ నటిగా ఫేమస్ అవ్వడానికి ముందే స్టార్స్ చిత్రాల్లో అవాకశాలు వస్తున్నాయి అంటే? అదంతా జాన్వీ ట్యాలెంట్ కాదు..మామ్ ఇమేజ్ అన్నది గుర్తించాలి.
అలాగని నటిగా తేలిపోలేదు. ఇప్పుడిప్పుడు కెరీర్ ని చక్కదిద్దుకునే ప్రయత్న చేస్తుంది. మామ్ ఇమేజ్ తో పాటు అమ్మడు ట్యాలెంట్ కలిసి రావడంతో ఛాన్సులు అందుకోగల్గుతుంది. ఈ విషయంలో జాన్వీ ఓ క్లారిటీతో ఉందని తాజాగా ఆమె వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. ఇటీవల చిట్ చాట్ బిగ్ కమర్శియల్ సినిమాల్లో నటించకపోవడం పై స్పందించింది. అందులో ఏమందంటే?
'నటిగా సక్సెస్ అయ్యేందుకు సులభమైన మార్గం ఉంది. కానీ ఇప్పటివరకూ ఆ రూట్ నాకొద్దు అనుకున్నా. గ్లామరస్ పాత్రలో బిగ్ కమర్శియల్ సినిమాలు చేయోచ్చు. అలాంటి చిత్రాల్లో నటిస్తే ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవుతాం. పాపులారిటీ వేగంగా దక్కుతుంది. మంచి పారితోషికం వస్తుంది. కానీ వాటిలో నటిస్తే నటిగా రాణించడమన్నది కష్టం. అలాంటి సినిమాల ద్వారా ఆరంభంలో నిలబడినా లైఫ్ లాంగ్ నిలదొక్కుకోవడం కష్టం.
భిన్నమైన పాత్రలు, కథలు చేసినప్పుడే బోలెడంత అనుభవం వస్తుంది. సినీ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుంది. జాన్వీ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు అనే పేరు తెచ్చుకోవాలి. అప్పుడే ఇక్కడ పోటీని తట్టుకుని నిలబడగలం. నన్ను సవాల్ చేసే పాత్రల్లో నటించడమే నాకు ఇష్టం. అందుకోసం ఎంత కష్టమైనా పడతా' అని తెలిపింది. నిజంగా జాన్వీ పర్పెక్ట్ ప్లానింగ్ తోనే ముందుకెళ్తుంది.