Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ మీద ఐకాన్ స్టార్ కన్ను..?

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్స్ ఆ సినిమాల్లో కథానాయికల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 5:46 AM GMT
ఆ హీరోయిన్ మీద ఐకాన్ స్టార్ కన్ను..?
X

వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్స్ ఆ సినిమాల్లో కథానాయికల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్న సినిమాలకు అదే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కావాలని అంటున్నారు. అందుకే ఈమధ్య ప్రతి సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. ఐతే తెలుగు తెర మీద తమ టాలెంట్ చూపించాలని చాలామంది భామలు వెయిటింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒకటి రెండు సినిమాలు చేసిన వారు కూడా తెలుగు సినిమా ఆఫర్ వస్తే బాగుండని చూస్తున్నారు.


ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తుంది బోనీ కపూర్ కూతురు జాన్వి కపూర్. ఎన్ టీ ఆర్ తో కలిసి అమ్మడు దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వి సౌత్ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే దేవర రిలీజ్ కాకుండానే జాన్వి కపూర్ చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాకు సైన్ చేసింది.

ఆ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఐతే జాన్వి థర్డ్ సినిమా విషయంపై క్లారిటీ రాలేదు. ఐతే జాన్వి కపూర్ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్ను పడిందని టాక్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఎన్ టీ ఆర్, చరణ్ తర్వాత అల్లు అర్జున్ జాన్వి కపూర్ తో జత కట్టాలని ఆసక్తి చూపిస్తున్నాడట.

జాన్వి కూడా పుష్ప రాజ్ ఛాన్స్ వస్తే కాదనే అవకాశం లేదు.జాన్వి కపూర్ కూడా బాలీవుడ్ లో కాస్త బ్యాడ్ టైం నడుస్తున్న కారణంగా తన పూర్తి ఫోకస్ మొత్తం తెలుగు సినిమాల మీద పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో స్టార్ సినిమా వస్తే మాత్రం నో అనకుండా ఓకే చేస్తుంది. పుష్ప 2 తర్వాత త్రివిక్రం డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ చేయగా త్రివిక్రం సినిమా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ లోనే మొదలు పెడతారని టాక్. అల్లు అర్జున్ జాన్వి జంటగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.