Begin typing your search above and press return to search.

మోక్ష‌జ్ఞ కోసం జాన్వీ క‌పూర్ ని ట్రై చేస్తున్నారా?

నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 5:30 PM GMT
మోక్ష‌జ్ఞ కోసం జాన్వీ క‌పూర్ ని ట్రై చేస్తున్నారా?
X

నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. `జైహ‌నుమాన్` తో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌కి...మోక్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే విష‌యాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ రివీల్ చేసాడు. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో విష‌యం అధికారికంగా వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. మోక్ష‌జ్ఞ ఇప్ప‌టికే యాక్లింగ్ లో శిక్ష‌ణ పూర్తి చేసాడు.

లుక్ లో సైతం మార్పులు తీసుకొస్తున్నాడు. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో బాల‌య్య ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న‌ది టీడీపీ ప్ర‌భుత్వం కావ‌డంతో ఇదే స‌రైన స‌మ‌యంగానూ పార్టీ కేడ‌ర్ కూడా భావిస్తోంది. అయితే ఇందులో మోక్ష‌జ్ఞ‌కు జోడీ కోసం హీరోయిన్ కోసం జ‌ల్లెప‌డుతున్నారు. నంద‌మూరి వార‌సుడి స‌ర‌స‌న హీరోయిన్ అంటే? ఓ బ్రాండ్ ఉండాలి.

ఓ రేంజ్ ఉండాలి. అలాంటి నాయిక కోస‌మే బాల‌య్య వెతుకుతున్నారు. హీరోయిన్ ఛాన్స్ మాత్రం బాల‌య్యే తీసుకున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి బాల‌య్య ఇప్ప‌టికే కొంత మంది భామ‌ల ఫోటోలు కూడా ప‌రిశీలించారుట‌. వాటిలో ఏవీ బాల‌య్య‌కు నచ్చకపోవ‌డంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్ అయితే ఎలా ఉంటుంద‌ని త‌ట్టింద‌ట‌. వెంట‌నే ద‌ర్శ‌కుడిని పిలిచి జాన్వీ పేరు సూచించారుట‌.

దీంతో ప్ర‌శాంత్ వ‌ర్మ అండ్ కోసం జాన్వీ క‌పూర్ కోసం ట్రై చేస్తున్న‌ట్లు స‌మాచారం. సెట్ అయితే కాంబినేష‌న్ బాగుంటుంది. మోక్ష‌జ్క్ష వ‌య‌సు రీత్యా కూడా సెట్ అవుతుంది. మోక్షజ్ఞ‌ ఏజ్ 29 కాగా, జాన్వీకి 27 సంవ‌త్స‌రాలు. మ‌రి జాన్వీ ఒప్పుకుంటుందా? లేదా? అన్న‌ది చూడాలి. జాన్వీ ఇప్ప‌టికే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ అంటూ సీనియ‌ర్ స్టార్ హీరోల‌తో ప‌ని చేస్తోంది. మోక్ష‌జ్ఞ కి ఇదే లాంచింగ్ మూవీ కాబ‌ట్టి అంగీక‌రిస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.