Begin typing your search above and press return to search.

నాని మాస్టర్ ప్లాన్.. నో సౌండ్ అంతే..!

న్యాచురల్ స్టార్ నాని తన సినిమాల ప్లానింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

By:  Tupaki Desk   |   20 July 2024 5:30 PM GMT
నాని మాస్టర్ ప్లాన్.. నో సౌండ్ అంతే..!
X

న్యాచురల్ స్టార్ నాని తన సినిమాల ప్లానింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన ఈ తరం కథానాయకుల్లో నాని ఒకరు. అందుకే ఆయన్ను చూసి స్ఫూర్తి పొంది కొందరు నాని బాటలో నడుస్తుంటారు. యువ హీరో నుంచి మినిమం గ్యారెంటీ హీరో గా ప్రమోట్ అయ్యి ఇప్పుడు టైర్ 2 స్టార్ గా ప్రతి సినిమాతో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు నాని. సినిమా స్క్రిప్ట్ దశలోనే పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ వేసుకుని సెట్స్ మీదకు వెళ్తాడు నాని. అందుకే ఈమధ్య నాని సక్సెస్ రేట్ అదిరిపోతుంది.

సినిమాల కన్నా నాని మంచి కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు అక్కడే ఆడియన్స్ అతనికి ఓటు వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సినిమాలతో వచ్చి రెండిటిని హిట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇదిలా ఉంటే నాని శ్రీకాంత్ ఓదెల.. దసరా కాంబోలో మరో సినిమా వస్తుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ ని హీరోయిన్ గా తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తున్న అమ్మడు రెండో సినిమా చరణ్ తో చేస్తుంది. మరి థర్డ్ సినిమా నానికి ఓకే అంటుందా అంటే ఏమో కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు.

జాన్వి కూడా బాలీవుడ్ లో యువ హీరోలతో నటిస్తుంది. టాలీవుడ్ లో రెండు భారీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇక్కడ అన్ని వర్గాల ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే కేవలం స్టార్స్ తోనే కాదు మిగతా హీరోలతో కూడా చేయాలి. అందుకే నాని సినిమా స్టోరీ నచ్చేస్తే నో చెప్పే ఛాన్స్ లేదు. నాని కూడా జాన్విని తీసుకుంటే ఈసారి తన ప్రాజెక్ట్ ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయొచ్చు. అంతేకాదు జాన్వి వల్ల బాలీవుడ్ లో సినిమాకు మంచి రీచ్ ఉంటుంది.

సో బిజినెస్ లెక్కల్లో చూసినా జాన్వి సినిమాలో ఉండటం వల్ల మార్కెట్ బాగుంటుంది. సో ఎలా చూసినా జాన్వికి నాని సినిమా ఎంత యూజ్ అవుతుందో తెలియదు కానీ జాన్వి వల్ల నాని శ్రీకాంత్ ప్రాజెక్ట్ కి కూడా అదే రేంజ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నాని దసరా డైరెక్టర్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని టాక్. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి ఓకే చేస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.