జాన్వీ కపూర్ డ్రీమ్ సైతం అతడి కలగా!
జాన్వీకపూర్ -శిఖర్ పహారియా మధ్య కొంత కాలంగా సీరియస్ లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 May 2024 6:29 AM GMTజాన్వీకపూర్ -శిఖర్ పహారియా మధ్య కొంత కాలంగా సీరియస్ లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు ఈ జోడీ జంటగా చిక్కిన సందర్భాలెన్నో. కలిసి పబ్ లకు వెళ్లడం దగ్గర నుంచి గుళ్లు గోపురాలు చుట్టేయడం...తిరుపతి దర్శనాల వరకూ ప్రతీది హాట్ టాపిక్ గానే కనిపించింది. కరణ్ జోహార్ టాక్ షోలో సైతం శిఖర్ ఫోన్ నెంబర్ కి జాన్వీ ఇచ్చిన ప్రాముఖ్యత.. `మైదాన్` షోకి శిఖు అనే లోగో ఉన్న చైన్ వేసుకోవడం వంటివి జాన్వీ ప్రేమని మరింత బలపరిచినట్లు కనిపించింది.
తాజాగా జాన్వీ శిఖర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శిఖర్ తో తనకున్న బాండింగ్ ఎంత ప్రత్యేకమైన్నది రివీల్ చేసింది. `శిఖర్ 15 ఏళ్ల వయసు నుంచి తెలుసు. ఇద్దరం కలిసి పెరిగాం. చాలా సన్నిహితంగా ఉంటాం. నా కలని తన కలగా భావిస్తాడు. తన కలని నా కలగా భావిస్తాను. అంతగా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతుంది` అని తెలిపింది.
దీంతో జాన్వీకి శిఖర్ అంటే ఎంతో ప్రత్యేకతో మరోసారి బట్టబయలైంది. మీడియా ప్రచారంతో పాటు.. జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు చేస్తోన్న వ్యాఖ్యలు ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలపరుస్తున్నాయి. అయితే ఇంతవరకూ అది ప్రేమ -స్నేహమా? అన్నది కరాఖండీగా ఇద్దరూ చెప్పింది లేదు. కుటుంబంలో ఓ సభ్యుడిగా శిఖర్ ని ఎప్పుడో చేర్చేసింది. కానీ ఆ రిలేషన్ షిప్ ని స్నేహంతోనే సరిపెడుతుందా? ప్రేమ...పెళ్లి అంటూ తన జీవితంలో నే ఓ భాగం చేస్తుందా? అన్నది చూడాలి.
ప్రస్తుతం జాన్వీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. నెటి జనులంతా ఆ ఇద్దరి మధ్య స్నేహాన్ని మించి సంథింగ్ నడుస్తుందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శిఖర్ పహారియా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. అతనొక ప్రొపెషనల్ బిజినెస్ మ్యాన్. ముంబైకి చెందిన వ్యాపార వేత్తలు సంజయ్ పహారియా - స్మ్రుతి షిండే దంపతుల కుమారుడు. శిఖర్ తాతయ్య మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్న సంగతి తెలిసిందే.