Begin typing your search above and press return to search.

అత‌డితో జాన్వీక‌పూర్ మ‌రోసారి రొమాన్స్!

ఇటీవ‌లే స్టోరీ వినిపించి ఇషాన్-జాన్వీ క‌పూర్ ని మెప్పించిన‌ట్లు తెలుస్తోంది. క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఒకే చేసారుట‌.

By:  Tupaki Desk   |   19 July 2024 5:47 AM GMT
అత‌డితో జాన్వీక‌పూర్ మ‌రోసారి రొమాన్స్!
X

బాలీవుడ్ లో మ‌రోసారి డెబ్యూ జోడీ జ‌త క‌డుతోందా? ఆ బాధ్య‌త కూడా తొలి సినిమా నిర్మాణ సంస్థే తీసుకుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇసాన్ క‌ట్ట‌ర్-జాన్వీక‌పూర్ హీరో, హీరోయిన్ల‌గా `ధ‌డ‌క్` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. జీ స్టూడియోస్ తో క‌లిసి ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ పై క‌రణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. శ‌శాంక్ ఖైతాన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇద్ద‌రికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. `మరాఠీ` సినిమా `సైర‌త్` కి రీమేక్ రూపంగా తెర‌కెక్కిన సినిమా ఎమోష‌న‌ల్ గా బాలీవుడ్ కి బాగా క‌నెక్ట్ అయింది. ఈ సినిమా త‌ర్వాత ఇద్ద‌రు బాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే జోడీతో మ‌రో సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోంది. ఈసారి కూడా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు క‌ర‌ణ్ జోహ‌ర్ ముందుకొచ్చారు. నీర‌జ్ గైవాన్ ఈ సినిమాకి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.

ఇటీవ‌లే స్టోరీ వినిపించి ఇషాన్-జాన్వీ క‌పూర్ ని మెప్పించిన‌ట్లు తెలుస్తోంది. క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఒకే చేసారుట‌. ఎమోష‌న్ చుట్టూ సాగే అద్భుత‌మైన స్టోరీ అని అంటున్నారు. అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. భోపాల్ లో మొద‌టి షెడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. మొత్తానికి జాన్వీ-ఇషాన్ క‌ట్ట‌ర్ మ‌రోసారి జోడీగా న‌టించ‌డం ఇంట్రెస్టింగ్. ఇక `ధ‌డ‌క్` షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని ప్ర‌చారం సాగింది.

కానీ అది ఎంతో కాలం నిల‌బ‌డ‌లేదు. ఇరువురు వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీ అవ్వ‌డంతో ఆ వార్త‌ పెద్ద‌గా ప్రాచుర్యంలోకి రాలేదు. ఇషాన్ కంటే జాన్వీ పెద్ద స్టార్ గా ఎదుగుతోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ తో పాన్ ఇండియా చిత్రం `దేవ‌ర‌`లో న‌టిస్తోంది. అలాగే రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలోనూ హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.