Begin typing your search above and press return to search.

వీడియో: ఫ‌న్ అంటే జాన్వీ.. జాన్వీ అంటే ఫ‌న్

నేటిత‌రం క‌థానాయిక జాన్వీ క‌పూర్ అంద‌చందాలు ప్ర‌తిభ‌లో మేటి అని నిరూపిస్తోంది

By:  Tupaki Desk   |   14 Aug 2024 7:30 PM GMT
వీడియో: ఫ‌న్ అంటే జాన్వీ.. జాన్వీ అంటే ఫ‌న్
X

నేటిత‌రం క‌థానాయిక జాన్వీ క‌పూర్ అంద‌చందాలు ప్ర‌తిభ‌లో మేటి అని నిరూపిస్తోంది. కాంపిటీష‌న్‌లో ఎంద‌రు ఉన్నా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ త‌న ప్ర‌త్యేక‌త‌ను ఆవిష్క‌రించ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కాలేదు. ఎంపిక చేసుకున్న క‌థాంశం, త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా జాన్వీ త‌న‌ను తాను మ‌లుచుకోవ‌డంలో తెర‌పై ఆవిష్క‌రించుకోవ‌డంలో ఎల్ల‌పుడూ ఎంతో ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రించింది.

బాలీవుడ్‌లో వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న జాన్వీ స‌రైన స‌మ‌యంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో ఘ‌న‌మైన ఆరంగేట్రాన్ని ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. దేవ‌ర తర్వాత బుచ్చిబాబుతో చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ ప్రాజెక్ట్ కి క‌మిటై బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల‌తో అవ‌కాశాలను ఒడిసిప‌ట్టింది. మునుముందు మ‌హేష్, ప్ర‌భాస్, బ‌న్ని లాంటి స్టార్ల‌తో న‌టించాల‌ని జాన్వీ ఉవ్విళ్లూరుతోంది.

మ‌రోవైపు... ఫ్యాష‌న్ గేమ్ లోను జాన్వీ త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటోంది. రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో జాన్వీ క‌పూర్ ట్రెండీ లుక్స్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అయితే వ‌ర్క్ లైఫ్ కాకుండా వ్య‌క్తిగ‌తంగా జాన్వీ ఎలా ఉంటుంది? త‌న ఫ్రీటైమ్ ని ఎలా సెల‌బ్రేట్ చేస్తుంది? అన్న‌దానిని ఆవిష్క‌రిస్తూ తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.

ఈ వీడియోలో జాన్వీ త‌న స‌హ‌చ‌రుల‌తో ఎంతో స‌ర‌దాగా ఆట‌లాడుతూ క‌నిపించింది. టీమ్ లో అంద‌రినీ ఆట‌ప‌ట్టిస్తూ.. గేమ్ లో ఫ‌న్ ని ఆస్వాధిస్తోంది. ఫ‌న్ అంటే జాన్వీ.. జాన్వీ అంటే ఫ‌న్! అన్న తీరుగా స‌ర‌దా మైండ్ సెట్ ని ఆవిష్క‌రించింది ఈ వీడియో. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ వీడియోని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ``అందం హాస్యం క‌ల‌బోత జాన్వీ క‌పూర్.. గ‌ల‌గ‌లా న‌వ్వేయ‌డం త‌న స్టైల్!`` అంటూ ఒక అంద‌మైన క్యాప్ష‌న్ ని ఈ వీడియోకి జోడించారు. ఎన్టీఆర్- జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి జాన్వీ క‌పూర్ గ్లింప్స్ కి అద్భుత స్పంద‌న వ‌స్తోంది.