Begin typing your search above and press return to search.

జాన్వీకి చెమ‌టలు ప‌టిస్తోన్న యంగ్ టైగ‌ర్!

తాజాగా తార‌క్ ట్యాలెంట్ గురించి అతిలోక సుంద‌రి జాన్వీకపూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

By:  Tupaki Desk   |   26 July 2024 10:00 AM GMT
జాన్వీకి చెమ‌టలు ప‌టిస్తోన్న  యంగ్ టైగ‌ర్!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెరీ ట్యాలెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. గ్రేట్ పెర్మార్మ‌ర్ గా అత‌డికి మంచి పేరుం ది. అందుకే రాజ‌మౌళి మెచ్చిన న‌టుడయ్యాడు. అత‌డు పోషించిన పాత్ర‌ల‌కే అంత పేరు తీసుకొచ్చాయి. అలాగే అంత‌కు మించి గొప్ప డాన్స‌ర్ గానూ తార‌క్ కి పేరుంది. ఒళ్లును విల్లులా వొంచి స్టెప్పులేయ‌డంలో అత‌డి త‌ర్వాతే ఎవ‌రైనా అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అలాగే ఆన్సెట్స్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు.

డైర‌క్ట‌ర్ సీన్ చెప్పాడంటే సింగిల్ టేక్ లో పూర్తిచేయ‌గ‌ల‌డు. ఇలా వృత్తి ప‌రంగా తార‌క్ మంచి పేరుంది. అలాగే భాష‌లు మాట్లాడ‌టంలోనూ అత‌డు తోపు అన్న‌ది తెలిసిందే. సౌత్ లో అన్ని ర‌కాల భాష‌లు మాట్లాడుతాడు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం భాష‌లు అవలీల‌గా మాట్లాడ‌గ‌ల‌రు. హిందీ సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడుతాడు. ఆ మ‌ధ్య ఆర్ ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ లో భాగంగా జ‌పాన్ వెళ్లిన‌ప్పుడు ఉన్న స‌మ‌యంలో ఆభాష‌ని సైతం నేర్చుకునే ప్ర‌య‌త్నం చేసాడు.

స్టేజ్ పై జ‌ప‌నీస్ లాంగ్వేజ్ సైతం కొద్దిగా మాట్లాడాడు. తాజాగా తార‌క్ ట్యాలెంట్ గురించి అతిలోక సుంద‌రి జాన్వీకపూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు జంటగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ‌ర‌'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 'జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎన‌ర్జిటిక్ హీరో. ఆయ‌న రాగానే సెట్ లో క‌ళ వ‌స్తుంది. అంద‌రూ ఉత్సాహంగా ఉంటారు. ఇటీవ‌ల జ‌రిగిన షెడ్యూల్ లో మాపై ఓపాట చిత్రీక‌రించారు. ఆయ‌న‌డాన్సు వేగాన్నిచూసి ఆశ్చ‌ర్య‌పోయాను.

ఎన్టీఆర్ ఒక్క సెకెన్ లో ఏదైనా చేయ‌గ‌ల‌రు, నేర్చుకోగ‌ల‌రు. అదే విష‌యాన్ని నేర్చుకోవ‌డానికి నాకు ప‌ది రోజులు స‌మ‌యం ప‌డుతుంది. ఆయ‌న‌తో చేయాల్సిన త‌ర్వాత పాట కోసం ఇప్ప‌టి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. కొర‌టాల శివ ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి కెప్టెన్. ఏ విష‌య‌మైనా సున్నితంగా చెబుతారు. ఆయ‌న‌తోప‌నిచేయ‌డం చాలా ఈజీగా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాల‌ని నా త‌ల్లిదండ్రులు నేర్పించారు. వాళ్ల‌తో పాటు నా అభిమానులంతా గ‌ర్వ‌ప‌డేలా ఉంటాను. ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నాను. రిలేష‌న్ గురించి వెల్ల‌డించే స‌మ‌యం లేదు' అని అన్నారు.