Begin typing your search above and press return to search.

దేవర విషయాలు చెప్పిన మిసెస్‌ మహి..!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తాజాగా మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది

By:  Tupaki Desk   |   22 May 2024 11:30 AM GMT
దేవర విషయాలు చెప్పిన మిసెస్‌ మహి..!
X

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తాజాగా మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత వారం రోజులుగా రెగ్యులర్‌ గా మీడియా ముందుకు వస్తుంది. ఈ అమ్మడు మీడియా ముందు పలు ఆసక్తికర విషయాలను వెళ్లడిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం గురించి మాట్లాడింది. చరణ్‌ మూవీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ దేవర సినిమా గురించి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దేవర సినిమాలో తాను 'తంగం' అనే పాత్రలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. నా పాత్ర పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌ మొత్తం కూడా చాలా సరదాగా సాగింది. దేవర యూనిట్‌ సభ్యులు అంతా కూడా నా పై చాలా అభిమానం మరియు ప్రేమను చూపించారు.

చిత్రం చాలా బాగా వస్తుందని అంతా భావిస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ గారితో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్ అద్భుతం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. దేరవ సినిమాలో నటించే అవకాశం రావడం నా లక్‌ గా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

రెండు పార్ట్‌ లుగా రాబోతున్న దేవర సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్‌ షూటింగ్‌ ను జూన్ లేదా జులై వరకు పూర్తి చేసే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దేవర 1 ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు.

దేవర మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండో పార్ట్‌ లో జాన్వీ కపూర్‌ యొక్క పాత్ర పరిధి ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇక రామ్‌ చరణ్‌ సినిమా లో ఈమె పాత్ర విషయానికి వస్తే పల్లెటూరు నేపథ్యం అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.