Begin typing your search above and press return to search.

దేవర.. ఇప్పుడు జాన్వీ హైలెట్ అయ్యేలా..

ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది

By:  Tupaki Desk   |   12 July 2024 4:15 AM GMT
దేవర.. ఇప్పుడు జాన్వీ హైలెట్ అయ్యేలా..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకి దేవర సినిమాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర మూవీ రిలీజ్ కానుంది.

ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కోలీవుడ్ లో ఇప్పటికి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగుతుంది. గత ఏడాది జైలర్, లియో సినిమాలతో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ అనిరుద్ సొంతం చేసుకున్నారు. తెలుగులో అయితే ఇప్పటివరకు అనిరుద్ కి కమర్షియల్ సక్సెస్ లభించలేదు. దేవర సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టాలనే కసితో అనిరుద్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ సింగిల్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దేవర మూవీ రిలీజ్ కి మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ కూడా అగ్రెసివ్ గా ప్రమోషన్ చేయాలని అనుకుంటుంది. అందులో భాగంగా దేవర మూవీ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ హీరోయిన్ బేస్డ్ మీద కంప్లీట్ మెలోడియస్ గా ఉండబోతుందట.

అది కూడా పూర్తిగా ఫిమేల్ వాయిస్తూనే సాంగ్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ మీద ఈ సాంగ్ ని చిత్రీకరించారంట. ఆమె పాయింట్ ఆఫ్ లో ఉండబోయే ఈ సాంగ్ ని సెకండ్ సింగిల్ గా ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చిత్ర యూనిట్ నుంచి వస్తుందని టాక్ వినిపిస్తోంది. దేవర మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

ఈ మూవీ సక్సెస్ అయితే కమర్షియల్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో సోలోగా తనకంటూ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హిందీలోకి వార్ 2 సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో వార్ 2 మూవీ భారీ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. మరో వైపు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.