నా కళ్లు బాగున్నాయంటారు.. కానీ ఎక్కడో చూస్తారు!
కాఫీ విత్ కరణ్ షో లో మరోసారి పాల్గొన్న జాన్వీ కపూర్ గతంలో మాదిరిగానే పలు ఆసక్తికర కొత్త విషయాలను తెలియజేసింది.
By: Tupaki Desk | 4 Jan 2024 7:41 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సాదారణంగా తన అందమైన ఫోటో షూట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచే ఈ అమ్మడు ఈసారి కాఫీ విత్ కరణ్ షో లో చేసిన బోల్డ్ కామెంట్స్ కారణంగా వార్తల్లో నిలిచింది.
కాఫీ విత్ కరణ్ షో లో మరోసారి పాల్గొన్న జాన్వీ కపూర్ గతంలో మాదిరిగానే పలు ఆసక్తికర కొత్త విషయాలను తెలియజేసింది. అంతే కాకుండా తన అందం గురించి జనాలు ఏమనుకుంటున్నారు అనే విషయమై కూడా సరదాగా కరణ్ షో లో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది.
మీలో మగవారు ఎక్కువగా ఏం చూస్తారు, ఏం నచ్చుతారు అని మీరు అనుకుంటారు అని కరణ్ ప్రశ్నించిన సమయంలో జాన్వీ కపూర్ స్పందిస్తూ.. చాలా మంది నా కళ్లు బాగున్నాయి అంటారు. నా కళ్లు అంటే ఇష్టం అని చెప్పిన వారు చాలా మంది ఉన్నారు.
కానీ చాలా మంది నా కళ్లు ఇష్టం అంటూనే నా శరీరంలో ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు అంటూ నవ్వేసింది. ఆమె అందాల ఆరబో ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె నడుము అందం తో పాటు అన్ని భాగాల అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. జాన్వీ వ్యాఖ్యల అర్థం కూడా అదే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే... కెరీర్ ప్రారంభించి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడు కమర్షియల్ గా హిట్ కొట్టలేదు. ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా హిట్ అయితే జాన్వీ కెరీర్ లో మొదటి హిట్ పడ్డట్టు అవుతుంది. మరి దేవర ఆమెకు హిట్ గా నిలిచేనా చూడాలి.