Begin typing your search above and press return to search.

'షికు' ఉన్నాడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సెట్స్ కి వెళుతూనే, చ‌ర‌ణ్ తో చిత్రీక‌ర‌ణ‌లో జాయిన‌వుతోంది.

By:  Tupaki Desk   |   3 May 2024 7:27 PM GMT
షికు ఉన్నాడు త‌స్మాత్ జాగ్ర‌త్త‌!
X

దివంగ‌త న‌టి, అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో బిజీ స్టార్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆరంగేట్ర‌మే ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోల స‌ర‌స‌న న‌టించేస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ `దేవ‌ర` సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇంత‌లోనే చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు సినిమాకి క‌మిటైంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సెట్స్ కి వెళుతూనే, చ‌ర‌ణ్ తో చిత్రీక‌ర‌ణ‌లో జాయిన‌వుతోంది.


ఇంత బిజీలోను ముంబై ప్ర‌యాణాల‌ను స్కిప్ కొట్ట‌డం లేదు. హైద‌రాబాద్ టు ముంబై విమాన ప్ర‌యాణం నిత్య‌కృత్యం. అంతేకాదు జాన్వీ ఇటీవ‌ల శిఖ‌ర్ ప‌హారియాతో షికార్ల‌ను ఆప‌డం లేదు. అత‌డితో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమ‌లేశుని ప‌దే ప‌దే సంద‌ర్శించ‌డ‌మే గాక‌, చాలా సంద‌ర్భాల్లో ఔటింగుల‌కు వెళుతూ జంట‌గా క‌నిపించింది ఈ బ్యూటీ. చాలా కాలంగా ఈ జోడీ ప్రేమాయ‌ణంపై గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


అంతేకాదు.. శిఖ‌ర్ పై త‌న‌కు ఉన్న ప్రేమ‌ను ఎంత‌మాత్రం దాచుకునేందుకు జాన్వీ సిద్ధంగా లేదు. త‌న మెడ‌లో చాలాసార్లు `షికు` అని రాసి ఉన్న నెక్లెస్ (లేదా పెండెంట్‌)ను ధరించి క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి.. తాను ఇప్ప‌టికే రిలేషన్ షిప్‌లో ఉన్నాన‌ని స్ప‌ష్ఠంగా హింట్ ఇస్తోంద‌ని ఊహిస్తున్నారు. ఇటీవ‌ల జాన్వీ క‌పూర్ మెడ‌లోని షికు పెండెంట్ మ‌రోసారి ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో దీనిపై ఒక‌టే చ‌ర్చ మొద‌లైంది. ``షికు లేనిదే జాన్వీ లేదు.. జాన్వీ లేనిదే షికు లేడు!`` అంటూ దీనిపై అభిమానులు కామెంట్లు గుప్పిస్తున్నారు. షికు లాకెట్ వెన‌క స్ఫూర్తి అత‌డే. అందులో ఎలాంటి సందేహం లేదని అంతా క‌న్ఫామ్ చేస్తున్నారు. అయితే జాన్వీ కానీ, శిఖ‌ర్ కానీ సూటిగా తాము డేటింగ్ చేస్తున్నామని ప్ర‌క‌టించక‌పోవ‌డం స‌స్పెన్స్ కి తావిస్తోంది.

అభిమానులు ఇప్ప‌టికి ఊహాగానాలతో అబ్బురపడుతున్నారు. జాన్వీ ఇటీవల ముంబై ఈవెంట్‌లో కనిపించింది. అక్కడ డిజైనర్ లుక్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. పొట్టి గ‌ళ్ల మిడ్డీ డ్రెస్ మ‌తులు చెడ‌గొడుతోంది. ముఖ్యంగా జాన్వీ పొడుగు కాళ్ల అందాన్ని ఈ డ్రెస్ ఎంత‌గానో ఎలివేట్ చేస్తోంది.ఇక‌ మెడ‌లో `షికు` హారాన్ని ధరించి సోషల్ మీడియాల్లో అగ్గి రాజేసింది. శిఖ‌ర్ నుంచి విడిపోయిన ఏడాది త‌ర్వాతా తిరిగి జాన్వీ అత‌డితో క‌లిసిపోయింది. ఇప్పుడు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం మ‌రింత ధృడ‌ప‌డుతోంద‌న్న సిగ్న‌ల్స్ అందాయి. అత‌డు జాన్వీ స్నేహితుడిగా త‌మ వెంటే ఉంటుంటే అది ఎంతో బావుంటుంద‌ని ఇంత‌కుముందు బోనీ వ్యాఖ్యానించ‌డంతో కొంత క్లారిటీ వ‌చ్చేసింది.