Begin typing your search above and press return to search.

కవ్వించే చందమామలా మెరుస్తున్న జాన్వీ..!

తాజాగా కొన్ని సెల్ఫీలు షేర్ చేసింది. పింక్ కలర్ షర్ట్ ధరించింది. ఈ ఫోటోలు క్లోజప్ లో కేవలం తన ఫేస్ హైలెట్ అయ్యేలా దిగడం విశేషం.

By:  Tupaki Desk   |   18 Sep 2023 10:34 AM GMT
కవ్వించే చందమామలా మెరుస్తున్న జాన్వీ..!
X

దివంగత నటి , అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని జాన్వీ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ధడక్‌తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. వరసగా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిలో ఏదీ ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ అవ్వలేకపోయింది. దీంతో, మంచి హిట్ కోసం చానాళ్లుగా కష్టపడుతోంది.


కాగా, జాన్వీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎంతలా అంటే, రోజుకి కనీసం ఒక పోస్టు అయినా పెడుతుంది. రోజూ కాకపోయినా వారానికి రెండు, మూడు పోస్టులైనా ఉంటాయి. ఎక్కువగా తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన అందాలతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడంలో ముందుంటుంది. తన తల్లి శ్రీదేవి అందమంతా పునికి పుచ్చుకున్నట్లుగా ఉంటుంది.

తాజాగా కొన్ని సెల్ఫీలు షేర్ చేసింది. పింక్ కలర్ షర్ట్ ధరించింది. ఈ ఫోటోలు క్లోజప్ లో కేవలం తన ఫేస్ హైలెట్ అయ్యేలా దిగడం విశేషం. ప్రకృతి ఒడిలో సేదతీరుతోంది అనుకుంట, గాలికి ముంగురులు ఎగసిపడుతున్నాయి. దీంతో, ఆ ముంగురులను సరిచేసుకుంటూ క్యూట్ గా సెల్ఫీలు తీసుకుంది. లైట్ మేకప్ తో ఆమె చాలా అందంగా కనపడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఫ్యాన్స్ అయితే, ఆమె అందానికి మంత్ర ముగ్ధులైపోతున్నారు. జాన్వీని చందమామతో పోలస్తున్నారు. చందమామను ఇక్కడ పెట్టుకొని చంద్రయాన్ ఇంకెక్కడికో వెళ్లి ఏం చేస్తోంది అంటూ ఓ నెటిజన్ ఇచ్చిన కాంప్లిమెంట్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 6లక్షలకు పైగా లైకులు రావడం విశేషం.

ఇదిలా ఉండగా, జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఈ బ్యూటీ తమిళంలోనూ అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా ఒకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.బ్యాలెన్స్డ్ గా అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ బ్యూటీ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.