Begin typing your search above and press return to search.

గుండె జిల్లు.. జాన్వీ స్మైల్ వీపందానికి!

అందంతోనే కాదు అంద‌మైన చిరున‌వ్వుతోను మ‌తులు చెడగొట్ట‌డం జాన్వీకే చెల్లింద‌ని కితాబిచ్చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 May 2024 4:12 AM GMT
గుండె జిల్లు.. జాన్వీ స్మైల్ వీపందానికి!
X

అవును.. ఆ వీపందం.. క‌వ్వించే ఆ స్మైల్ కి ప‌డిపోయామంటూ ఫిదా అయిపోతున్నారు నెటిజ‌నం. సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారిన జాన్వీ క‌పూర్ ఈ స్పెష‌ల్ లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. అంద‌మైన చిరునవ్వు.. ట్రెడిష‌న‌ల్ పంజాబీ డ్రెస్ లో బుట్ట‌బొమ్మ‌ను త‌ల‌పిస్తోంది. ఇటీవ‌లి కాలంలో బాపు బొమ్మ ఎవ‌ర‌మ్మా? అని వెత‌కాల్సిన ప‌రిస్థితి ఉంది. అలాంటి వారికి ఇదిగో ఇక్క‌డ స‌రైన జ‌వాబు దొరుకుతుంద‌ని జాన్వీని చూపించ‌గ‌లం ఇప్పుడు.

చిట్టి పొట్టి నిక్క‌ర్లు, బికినీలు స్విమ్ సూట్ల‌లో మ‌తులు చెడ‌గొట్టే జాన్వీయేనా? ఇంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తోంది! అంటూ చాలా మంది కుర్రాళ్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంతేకాదు ఇక‌పైనా ఈ ముగ్ధ మ‌నోహ‌రి ఇలానే కొన‌సాగాల‌ని కూడా చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. అందంతోనే కాదు అంద‌మైన చిరున‌వ్వుతోను మ‌తులు చెడగొట్ట‌డం జాన్వీకే చెల్లింద‌ని కితాబిచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా జాన్వీ వీపు సొగసును కుర్రాళ్లు త‌మ‌దైన శైలిలో అభివ‌ర్ణిస్తున్నారు. వీపు చూడు వీపందం చూడు! అంటూ జాన్వీ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి చిత్రంలో జాన్వీ క‌పూర్ చండీఘ‌ర్ కి చెందిన పంజాబి కుడిగా క‌నిపించింది. ఆ లుక్ ని ఇప్పుడు రివీల్ చేయ‌గా జ‌నం మ‌తులు చెడి అందంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ కపూర్ సౌత్‌లో వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభ‌మే టాలీవుడ్ సూప‌ర్ స్టార్లు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. దేవ‌ర‌లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న జాన్వీ, త‌దుప‌రి చ‌ర‌ణ్ - బుచ్చిబాబు చిత్రంలోను న‌టిస్తోంది. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ తెర‌కెక్కిస్తే అందులో క‌చ్ఛితంగా జాన్వీ క‌థానాయిక అని చ‌ర‌ణ్ క‌న్ఫామ్ చేసాడు. దీనికోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నార‌ని బుచ్చిబాబుతో సినిమా లాంచ్ లో చ‌ర‌ణ్ స్వ‌యంగా అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే జాన్వీ క‌పూర్ త‌దుప‌రి ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇంత‌లోనే రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు చిత్రంలో న‌టించే రేర్ ఛాన్స్ కొట్టేసింది. జాన్వీ ఇప్పుడు కోలీవుడ్ లోను అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌తిభావంతుడైన సిలంబరసన్ అలియాస్ శింబు సరసన STR 48తో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శింబు తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు దేశింగ్ పెరియసామితో క‌లిసి పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా STR 48 అని పేరు పెట్టారు. ఏడాది క్రిత‌మే ప్రారంభ‌మైన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనికి ఎక్కువ సమయం పట్టింది.