లెహంగాలో జాన్వీ వావ్ అనిపించేలా!
అతిలోక సుందరి శ్రీదేవి లెగస్సీని అందుకోవాలని కుమార్తె జాన్వీ కపూర్ బాగానే ప్రయత్నిస్తుంది.
By: Tupaki Desk | 4 July 2024 9:35 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి లెగస్సీని అందుకోవాలని కుమార్తె జాన్వీ కపూర్ బాగానే ప్రయత్నిస్తుంది. నటిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. బాలీవుడ్ లో తిరుగులేని నిరూపించుకుంది. అందుకే సౌత్ పై కన్నేసి సినిమాలు చేస్తోంది. దీనిలో భాగంగా టాలీవుడ్ లో వేగంగా ముందుకు కదులుతుంది. ఇప్పటికే అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన` దేవర` లో నటిస్తుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ ఛాన్స్ అందుకుంది.
ఆ రకంగా జాన్వీకి టాలీవుడ్ లో బెస్ట్ లాంచింగ్ దొరికింది. ఎంతో మంది వారసురాళ్లు ఉన్నా? వాళ్లెవ్వరికీ రాని అవకాశం జాన్వీకి దక్కిందంటే? మామ్ ఇమేజ్ ఎంతగా పనిచేస్తుందన్నది చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియాలో జాన్వీ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. తాజాగా అమ్మడు డిజైనర్ లెహంగాలో అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే? మతి చెడిపోవడం ఖాయం.
అమ్మడు అంత అందంగా హైలైట్ అవుతుంది. ముంబైలో ఓ ప్రయివేట్ పంక్షన్ కి హాజరైన సందర్భంగా ఇంత అందంగా ముస్తాబైంది. పింక్-ఆరెంజ్ కలర్ లెహంగాలో జాన్వీ ధగధగలాడిపోతుంది. పెదాలపై సన్నని చిరు నవ్వు చిందిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. మిరుమిట్లు గొలుపుతోన్న లైటింగ్ లో జాన్వీ మరింత ప్రకాశ వంతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ట్రెడీషనల్ దుస్తుల్లో కనిపించే సరికి జాన్వీ సంథింగ్ స్పెషల్ అంటూ ఓ అభిమాని కామెంట్ పోస్ట్ చేసాడు. సంప్రదాయ దుస్తుల్లో జాన్వీ అందాన్ని ఆస్వాదించడానికి రెండు కళ్లు చాలవేమో! అంటూమరొకరు పోస్ట్ చేసారు.