స్వచ్ఛమైన లవ్ స్టోరీలో లస్ట్ సీన్లా?
దీనిలో భాగంగా జాన్వీ కపూర్..వరుణ్ ధావన్ తో కలిసి కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటిస్తుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 7 July 2024 6:23 AM GMTజాన్వీకపూర్ ఇంతవరకూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది లేదు. డెబ్యూ 'ధడక్' లాంటి లవ్ స్టోరీ చేసినా? అందులో ఆ ఛాన్స్ తీసుకోలేదు. స్వచ్ఛమైన లవ్ స్టోరీ కావడంతో అందులో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కడా డిమాండ్ చేయలేదు. కాబట్టి దర్శకుడు కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు.ఆ తర్వాత కొన్ని లవ్ స్టోరీ లు చేసింది. కానీ వేటిలోనూ జాన్వీ మార్క్ రొమాన్స్ ఇది అని ఎక్కడా చాటింది లేదు.
కొన్ని కాన్సెప్ట్ బేస్ట్ సినిమాలు చేసింది. అందులోనూ నో ఛాన్స్ అనేసింది. అయితే స్వచ్ఛమైన లవ్ స్టోరీ లో లస్ట్ బ్యూటీలా ఇప్పుడు హైలైట్ అవుతుంది అన్నది తాజా సమాచారం. ప్రస్తుతం వరుణ్ ధావన్ కి జంటగా 'సన్నీ సంస్కారి కి తులసి కుమారీ' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శశాంక్ ఖైతాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తులసి ప్రేమను దక్కించుకోవడానికి సన్ని ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? అన్నది సినిమా మెయిన్ థీమ్.
స్వచ్ఛమైన ప్రేమకథగా మొదటి నుంచి చిత్రాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు ఏమాత్రం కొదవలేదన్నది తాజా సమాచారం. దీనిలో భాగంగా జాన్వీ కపూర్..వరుణ్ ధావన్ తో కలిసి కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటిస్తుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తులసి ప్రేమను సన్నీ దక్కించుకున్న అనంతరం చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఈ సన్నివేశాలు వస్తాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మునుపెన్నడు చూడని సరికొత్త జాన్వీని ఈ సినిమాలో చూస్తారని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జాన్వీ-వరుణ్ జంటగా 'బవాల్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మద్య కెమిస్ట్రీ ఇబ్బందులేవి ఉండవని తెలుస్తోంది. అలాగే 'దేవర'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనూ ఓ రొమాంటిక్ పాటలో నటిస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.