Begin typing your search above and press return to search.

నెంబ‌ర్-1 అయ్యే దాకా క‌దిలేదే లేదా?

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీక‌పూర్ ఎంట్రీ ముందు ఎంత‌టి స్థ‌బ్ధ‌త నెల‌కొందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 April 2024 2:30 AM GMT
నెంబ‌ర్-1 అయ్యే దాకా క‌దిలేదే లేదా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీక‌పూర్ ఎంట్రీ ముందు ఎంత‌టి స్థ‌బ్ధ‌త నెల‌కొందో తెలిసిందే. బాలీవుడ్ లో లాంచ్ అవుతుందా? టాలీవుడ్ లో లాంచ్ అవుతుందా? కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా? అన్న దానిపై అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చే సాగింది. చివ‌రికి `ధ‌డ‌క్` చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ త‌ర్వాత అమ్మ‌డి కెరీర్ అక్క‌డ ఎలా సాగిందో తెలిసిందే. డెబ్యూ ద‌గ్గ‌ర నుంచి `బ‌వాల్` వ‌ర‌కూ ఆరేడు సినిమాలు చేసింది. కానీ బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో మోతెక్కించిన సినిమా అంటూ వెతికితే ఏది క‌నిపించ‌దు.


దీంతో జాన్వీ మ‌రో ఆలోచ‌న‌లే కుండా టాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `దేవ‌ర‌`తో జాన్వీ పాన్ ఇండియాలో ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈ ఛాన్స్ కంటే ముందే చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. `ఆర్ ఆర్ ఆర్` సినిమాలో సీత పాత్ర‌తోనే జాన్వీని టాలీవుడ్ లో లాంచ్ చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేసాడు. కానీ ఆస‌మ‌యంలో తండ్రి-కుమార్తెల‌కు అది న‌చ్చ‌లేదు.

దాన్ని బెస్ట్ లాంచింగ్ మూవీలా భావించ‌లేదు. అప్ప‌టికి అలా ఆగినా డాట‌ర్ అండ్ డాడ్ ఆ వెంట‌నే దేవ‌ర తో షురూ చేసారు. ఇది సెట్స లో ఉండ‌గానే రామ్ చ‌ర‌ణ్ సినిమాకి జాన్వీనే ఎంపిక చేసారు. ఇలా ఒకేసారి ఇద్ద‌రు అగ్ర హీరోల‌తో జాన్వీ న‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇలాంటి అవ‌కాశం ఏ న‌టికి ద‌క్క‌దు. కేవ‌లం శ్రీదేవి కుమార్తె అన్న ట్యాగ్ మాత్ర‌మే ఆ ఛాన్సులు క‌ల్పించింది అన్న‌ది వాస్త‌వం.

మ‌రి అందుకు త‌గ్గ‌ట్టు జాన్వీ ఇక్క‌డి కెరీర్ పై ఫోక‌స్ చేస్తుందా? అంటే తాజాగా కొన్ని లీకులం దుతున్నాయి. జాన్వీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లేది ఇక్క‌డ నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్న త‌ర్వాత సిటీ దాటేది అని తాజాగా లీకులందుతున్నాయి. ఇక్క‌డ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి స‌క్సెస్ అవ్వాల‌నే క‌సితోనే రంగంలోకి దిగిందంటున్నారు. దీనికి సంబంధించిన ప్లానింగ్ ..స్ట్రాట‌జీ అంతా తండ్రీ బోనీక‌పూర్ సిద్దం చేసి పెట్టార‌ని ఆ ప్రకార‌మే జాన్వీ న‌డుచుకుంటుంద‌ని స‌మాచారం.