మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా జాన్వీ!
ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాలు వంటివి రియల్ గానే చాలా మంది హీరోలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 July 2024 11:27 AM GMTయాక్షన్ సన్నివేశాలంటే దాదాపు డూప్ తోనే ఎక్కువగా ఉంటాయి. సీన్ లో రియాల్టీ ఉండదని భావిస్తే తప్ప! అంతవరకూ రియలిస్టిక్ సన్నివేశాల జోలికి వెళ్లరు. అయితే ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం రియల్ స్టంట్లకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. డూప్ కంటే రియల్ గానే చేద్దాం అన్న భరోసాతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాలు వంటివి రియల్ గానే చాలా మంది హీరోలు చేస్తున్నారు.
ఇక ప్రత్యర్ధుల్ని కొట్టే సన్నివేశాలైతే విఎఫ్ ఎక్స్ లో రియల్ ఫైట్ సన్నివేశాల్నే తలపిస్తాయి. వాటి కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. తాజాగా జాన్వీ కపూర్ `ఉలజ్` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు కొన్నియాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. అయితే జాన్వీ ఎంత సున్నిమతైన మనస్కు రాలు అన్నది ఆసినిమా కి పనిచేసి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పోవెల్ రివీల్ చేసాడు. జాన్వీ చాలా సున్నితం.
ఎవరినైనా కొట్టి గాయపరిచే అమ్మాయి కాదు. కొన్నిసన్నివేశాల్లోనలుగుర్ని కొట్టడానకి వెనుకాడని ధైర్య సాహసిగా అనిపించినా... తాను కొడితే ఆ దెబ్బకి అవతలి వారు ఎంత బాధపడతారోనని ఆలోచించేది. ఇలాంటి నటిని ఇంతవరకూ నేను చూడలేదు. మనుషులు మరీ ఇంత సున్నితంగా ఉంటారా? అని జాన్వీని చూసినప్పుడే అనిపించింది. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలకు పని చేసాను. కానీ జాన్వీ లాంటి సున్నిమైతన అమ్మాయిని చూడలేదు. ఉలజ్ లో మంచి టీమ్ తోపని చేసాను` అని అన్నారు.
నిక్ పోవెల్ బర్న్ ఐడెంటీ, గ్లాడియేటర్, ది లాస్ సమురై సహా చాలా సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేసారు. ఉలజ్ సినిమా కోసం దర్శకుడు ప్రత్యేకంగా ఇక్ని న్యూయార్క్ ని ఇండియాకి రప్పించారు. ఆయన ఆధ్వర్యంలోనే జాన్వీ యాక్షన్ సన్నివేశాలుచేసింది. ఆగస్టు 2న ఈ సినిమా రిలీజ్ అవుతోన్నసంగతి తెలిసిందే.