సొంత చెల్లిని రూమ్ నుంచి గెటౌట్ అన్న స్టార్ హీరోయిన్
అక్కా చెల్లెళ్లు మధ్య ప్రేమ ఆప్యాయతలు, అనుబంధం ఎంతో ముచ్చటగొలుపుతాయి. వారి మధ్య ప్రేమ అనంతం.
By: Tupaki Desk | 6 May 2024 3:43 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ 'మామ్' స్ఫూర్తితో రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జాన్వీ ఇప్పటికే పెద్ద స్టార్. ఖుషీ కపూర్ 'ది ఆర్చీస్' వెబ్ సిరీస్ లో నటించి, ఇప్పుడు తొలి వెండితెర అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక తన చెల్లి ఖుషీకి జాన్వీ కపూర్ సలహాలు సూచనలు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. నటిగా ఎలా షైన్ అవ్వాలి? ఈ రంగంలో మగ నటులతో ఎలా ఉండాలి? వంటి విషయాలను జాన్వీ ఇప్పటికే ఖుషీకి వివరించి చెప్పింది. అక్కా చెల్లెళ్లు మధ్య ప్రేమ ఆప్యాయతలు, అనుబంధం ఎంతో ముచ్చటగొలుపుతాయి. వారి మధ్య ప్రేమ అనంతం.
అదంతా అటుంచితే అక్కా చెల్లెళ్ల మధ్య గొడవలేవీ రావా? అసలు కలతలు, అభిప్రాయవిభేధాలు ఉండవా? అంటే .. ఎందుకు ఉండవు? బోలెడన్ని గొడవలు.. కొట్లాటలు.. ఆ ఇద్దరి మధ్యా పెద్ద గొడవలు జరుగుతాయి. కానీ ఆ తరవాత మళ్లీ సర్ధుకుపోతారు. ప్రతి ఇంట్లో అక్కా చెల్లెళ్లు అన్నదమ్ముల మాదిరిగానే కొన్ని విషయాల్లో గొడవపడతారు. కానీ వెంటనే కలిసిపోతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
ఎయిర్ బిఎన్‌బి 2024 ఈవెంట్ సందర్భంగా న్యూయార్క్‌లో స్టడీస్ లో ఉన్న ఖుషీని సందర్శించినప్పుడు జాన్వీ అక్కడ రూమ్ లో కుదురుగా లేదట. ఓవర్ నైట్ లో రచ్చ రచ్చ చేసిందిట. చివరిసారిగా ఖుషీతో కలిసి గదిని షేర్ చేసుకున్న విషయాన్ని జాన్వీ కపూర్ గుర్తుచేసుకుంది. తనవైన DIY బ్యూటీ ట్రీట్‌మెంట్‌లకు పేరుగాంచిన జాన్వి, ఖుషీ గదిలో దొరికిన ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, గుడ్లు, అవకాడోను ఉపయోగించి హెయిర్ మాస్క్‌ను తయారు చేసింది. ఆమె ముఖానికి పెరుగు- స్ట్రాబెర్రీలను కూడా పూసుకుంది. అయితే షవర్‌లోని వేడి నీరు ఆమె జుట్టులో గుడ్డును వండడంతో ఆమె ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. బాత్రూమ్ ఫ్లోర్‌లో గిలకొట్టిన గుడ్లను వదిలివేసింది.
అయితే తన గదిలో బాత్రూమ్‌ని ఇంత వరస్ట్ గా మార్చిన జాన్వీపై ఖుషి ఒక రేంజులో విరుచుకుపడింది. ఆ బాత్రూమ్‌ను ''డర్టీ రెస్టారెంట్ బ్యాక్ ఏరియా''తో పోల్చుతూ జాన్వీని తన అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అరిచింది. రూమ్ నుంచి గెటౌట్ అంది! ఇద్దరు సోదరీమణుల విలక్షణమైన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ జాన్వీ హాస్యభరితమైన సంఘటనను వివరించింది. ఆ గొడవ తర్వాత సోదరి ఖుషీ కపూర్‌కి జాన్వీ కపూర్ క్షమాపణ చెప్పింది. ''నన్ను క్షమించు.. నేను నీతో పోరాడాను.. ఐ లవ్ యు'' అని అంది.
ఒక పాత ఇంటర్వ్యూలో జాన్వీ తన సోదరి ఖుషీకి ఒక వివేకవంతమైన సలహా ఇచ్చింది. నటీమణులుగా ఉన్నప్పుడు తమ వ్యక్తిత్వాల కారణంగా హీరోలతో డేటింగ్ చేయకూడదని జాన్వీ సూచించింది. అలాగే ఖుషీతో తన అనుబంధానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. జాన్వీ -ఖుషీ కపూర్‌ల మధ్య బంధానికి సింబాలిక్ గా ఆప్యాయత, హాస్యం, సలహాల కోసం కలయిక ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవే. హిందీ చిత్రసీమలో గొప్ప ప్రేమానుబంధం ఉన్న అక్కా చెల్లెళ్లుగా జాన్వీ- ఖుషి ఇప్పటికే మనసులు గెలుచుకున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఖుషీ కపూర్ బాలీవుడ్ లో రెండు చిత్రాలతో బిజీ బిజీ.