హాట్ బ్యూటీతో జాన్వీ జివ్వుమనిపించిందే!
విదేశీ మోడల్స్ నే తలపించేలా? ఎన్నో ఎంపికల్లో మెరిసింది.
By: Tupaki Desk | 14 July 2024 2:30 PM GMTజాన్వీకపూర్ ఫ్యాషన్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ ఎంపికల్లో తానో బ్రాండ్ అని తొలి నాళ్లలో ముద్ర వేసేసింది. అటుపై నటిగా పరిణితి చెందుతోన్న క్రమం కొద్ది ఎంపికల్లో మరింత యూనిక్ స్టైల్ ని అనుసరించడం మొదలు పెట్టింది. బ్యూటీ పరంగా ఎలివేషన్ కోసం అమ్మడు దేశ సరిహద్దులు ఎప్పుడో దాటిపోయింది. విదేశీ మోడల్స్ నే తలపించేలా? ఎన్నో ఎంపికల్లో మెరిసింది.
ఇక అంబానీ ఇంట పెళ్లి వేడుక కోసం ఎంత అందంగా ముస్తాబైందో తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లి వాతావరణం మొదలైన నాటి నుంచి ప్రతీ ఈవెంట్ లో పాల్గొంది. వాటిలో జాన్వీ కపూర్ డిజైనర్ దుస్తులే హైలైట్ అయ్యాయి. తాజాగా మరోసారి బ్రైడల్ కోచర్ 2024 కలెక్షన్‌ని ధరింది నెటి జనుల్ని మైమపరి పించింది. ఇదిగో ఇక్కడిలా ఆర్ట్ నోయువే-ప్రేరేపిత స్ఫటికాలు, ముత్యాలు సీక్విన్‌లతో ఎంబ్రాయిడరీ చేసిన స్ట్రక్చర్డ్ స్వీపింగ్ స్కర్ట్ లో తళుక్కున మెరిసింది.
కాంప్లిమెంటింగ్ క్రిస్టల్‌తో ప్రత్యేకంగా అలంకరించబడింది. కార్సెట్ అండ్ డ్రేప్ రెక్కలతో హ్యాండ్స్ ని డిజైన్ చేసిన వైనం ఆకర్షణీయంగా ఉంది. నెక్ ని ప్రీ గా ఉంచుతూ ఫోకస్ అంతా ఆ డిజైన్ పై పడేలా చేయడంలో అమ్మడు నూరుశాతం సక్సస్ అయింది. దీన్ని ప్రముఖ ఫ్యాషనిస్ట్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసారు. అంబానీ ఇంట పెళ్లి వేడుక కోసం జాన్వీ తరుణ్ డిజైనర్ దుస్తుల్నే ఎక్కువగా ధరించింది.
వాటిలో ఇదో రకమైన న్యూ మోడల్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక నటిగా జాన్వీ కపూర్ ఎంత బిజీగా ఉందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `దేవర`లో నటిస్తోంది. ఇది పూర్తికాగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తోంది. ఈ రెండు గాక బాలీవుడ్ సినిమాలు చేస్తోంది.