ఎర్ర కోకలో జాన్వీ సొగసు చూడతరమా!
అందాల జాన్వీ కపూర్ ప్రస్తుతం `మిస్టర్ అండ్ మిసెస్ మహి` ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2024 1:17 PM GMTఅందాల జాన్వీ కపూర్ ప్రస్తుతం `మిస్టర్ అండ్ మిసెస్ మహి` ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో కథానాయకుడు. క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇదని జాన్వీ ప్రచారం చేస్తోంది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లు సహా వీలున్న ప్రతి వేదికపైనా జాన్వీకపూర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తోంది. మహి (మహిమ తన పాత్ర పేరు) ప్రచారానికి స్పందన అద్భుతం.
మరోవైపు మహి థీమ్డ్ డిజైనర్ డ్రెస్ లు కుర్రకారు హృదయాల్ని హత్తుకుంటున్నాయి. తాజాగా జాన్వీ కపూర్ ధరించిన డిజైనర్ శారీ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఎర్ర కోక.. బులుగు అంచు.. కాంబినేషన్ ఎరుపు రంగు డిజైనర్ రవికెలో జాన్వీ ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. జాన్వీ మునుపటి కంటే సంథింగ్ స్పెషల్ గా ఉందంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.
తాజా ప్రచార వేదికపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎమ్‌ఎస్ ధోని నంబర్ 7 జెర్సీని ఎవరూ తీసుకోలేరని నొక్కి చెప్పింది. జాన్వీ కపూర్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా `మిస్టర్ & మిసెస్ మహి` సినిమా ప్రమోషన్ల కోసం ధరించే తన దుస్తులపై ఆరో నంబర్ ని ముద్రించడం వెనక ప్రాముఖ్యతను వెల్లడించింది. ఈ నంబర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో మధురమైన అనుబంధాన్ని కలిగి ఉందని తెలిపింది.
రాజ్‌కుమార్ రావు నటించిన చిత్రంలో మహిమ పాత్రను పోషిస్తున్న జాన్వీ ఇటీవల నంబర్ 6 ఉన్న దుస్తులను పదే పదే ధరించి ఈవెంట్లలో కనిపించింది. బార్బీ పింక్ స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌పై 6 నంబర్ రాసి ఉన్న టాప్ ని వారం క్రితమే ధరించింది. దీనికి బాటమ్ లో బ్లాక్ అండ్ వైట్ చారల స్కర్ట్ ను జతగా ధరించింది. మే 3న తన టాప్ ముందు భాగంలో `మహి 6` అని రాసి ఉన్న నీలిరంగు హాఫ్-స్లీవ్ క్రాప్ టాప్ ని ధరించగా, దానికి వెనుకవైపు `క్రికెట్ ఈజ్ లైఫ్ ఔర్ లైఫ్ ఈజ్ క్రికెట్` అని రాసి ఉంది.
జాన్వీ ప్రచార దుస్తులపై నంబర్ 6 ఉండటం వెనుక కారణమేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత జనంలో పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో జాన్వీ దీనికి సమాధానం ఇచ్చింది. ``మహిమ జెర్సీ నంబర్ 6, .. ఆమె ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమాని. నిజానికి ధోని జెర్సీ నంబర్ 7`` అని వివరించింది. సినిమాలో నా జెర్సీ నంబర్ ఏమిటో నిర్ణయించుకున్నప్పుడు దర్శకుడు శరణ్ శర్మ, మేమంతా ధోనీపై గౌరవంతో 7 నంబర్ ఆయనకు మాత్రమే చెందాలని.. అందుకే మరొక నంబర్ ని ఎంచుకోవాలని చివరిగా 6 నంబర్ ని ఎంపిక చేసుకున్నామని జాన్వీ తెలిపింది. 6 - నా అదృష్ట సంఖ్యగా భావిస్తున్నారు. ఇది నాకు అదృష్టమని ఆశిస్తున్నాను.. అని జాన్వీ అంది. `` మహిమ జెర్సీ నంబర్ 6, ధోనీ సర్ జెర్సీ నంబర్ 7, అది ఎల్లప్పుడూ 7గా ఉండాలి. 7 నంబర్‌ను ఎవరూ తీసుకోకూడదు.. వారికి గౌరవ సూచికగా..`` అని జాన్వి చెప్పింది.
మిస్టర్ & మిసెస్ మహి ప్రేమకథతో కూడుకున్న కుటుంబ కథా చిత్రం. ఇందులో కామెడీ, రొమాన్స్, క్రికెట్, ఎమోషన్స్ ఉన్నాయి అని జాన్వీ తెలిపింది. ఈ చిత్రం క్రికెట్ అంటే విపరీతంగా ప్రేమించే జంటల మధ్య అసంపూర్ణమైన పరిపూర్ణ భాగస్వామ్య కథను ఆవిష్కరిస్తుందని తెలిపింది. రూహీ తర్వాత జాన్వీ- రాజ్ కుమార్ రావు జంటకు ఇది రెండో సినిమా.