Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : దేవుడా.. ఏమీ ఈ అందం

అతిలోక సుందరి శ్రీదేవి అందానికి అప్పట్లో ఎంతటి వారు అయినా ఫిదా అయ్యేవారు. దేవ కన్య పాత్రలో నటిస్తే నిజంగా దేవకన్య నా అన్నంత అందంగా శ్రీదేవి మాట మరియు బాడీ లాంగ్వేజ్ ఉండేది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 3:30 PM GMT
పిక్ టాక్ : దేవుడా.. ఏమీ ఈ అందం
X

అతిలోక సుందరి శ్రీదేవి అందానికి అప్పట్లో ఎంతటి వారు అయినా ఫిదా అయ్యేవారు. దేవ కన్య పాత్రలో నటిస్తే నిజంగా దేవకన్య నా అన్నంత అందంగా శ్రీదేవి మాట మరియు బాడీ లాంగ్వేజ్ ఉండేది. అందుకే అప్పట్లోనే శ్రీదేవి సౌత్ తో పాటు నార్త్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది.


ఇప్పడు ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్‌ తన అందంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. తల్లి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా తన అందం మరియు అభినయంతో సొంతంగా ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


హిందీలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించి జాన్వీ కపూర్‌ కమర్షియల్‌ గా హిట్‌ కొట్టలేదు. కానీ ఇలాంటి అందమైన ఫోటో షూట్స్‌ కారణంగా స్టార్‌ హీరోయిన్‌ ల స్థాయిలో సోషల్‌ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు.


తాజాగా జాన్వీ షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చీర ను విభిన్నంగా కట్టి, లాంగ్ లెగ్త్‌ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన జాన్వీ కపూర్‌ లుక్స్ కి ఫ్యాన్స్ మరియు నెటిజన్స్‌ వావ్‌ దేవుడా ఏమి ఈ అందం అన్నట్లుగా కామెంట్స్ చేస్తూ తెగ లైక్‌ చేస్తున్నారు.


ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ లో హిట్‌ పడకున్నా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక టాలీవుడ్‌ లో దేవర సినిమా తో ఎన్టీఆర్‌ కి జోడీగా నటించడం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ లో జాన్వీ ప్రస్తుతం పాల్గొంటోంది. మరో వైపు ఇలాంటి అందమైన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి వినోదాన్ని పంచుతోంది.