Begin typing your search above and press return to search.

దేవర : ఏడాది పాటు ఇదే కోరుకున్నా.. జాన్వీ కపూర్‌

ఎన్టీఆర్‌ తో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న తనకు దేవర సినిమా తో ఛాన్స్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని జాన్వీ కపూర్‌ పేర్కొంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 2:30 PM GMT
దేవర : ఏడాది పాటు ఇదే కోరుకున్నా.. జాన్వీ కపూర్‌
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ కు తల్లి స్టార్‌ డమ్‌ పెద్దగా కలిసి రాలేదు. ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌ లో అడుగు పెట్టగలిగింది కానీ సక్సెస్‌ లు మంచి పాత్రలు అందుకోవడంలో మాత్రం విఫలం అయింది. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎంట్రీకి రెడీ అయింది.

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న 'దేవర' సినిమా లో ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో దక్కని సక్సెస్‌ ను టాలీవుడ్‌ లో అయినా దక్కించుకోవాలనే ఆశతో జాన్వీ కపూర్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. దేవర సినిమా ప్రకటించిన తర్వాత ఏడాది పాటు తాను ఆ సినిమాలో ఉండాలని కోరుకున్నాను. ఎన్టీఆర్‌ తో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న తనకు దేవర సినిమా తో ఛాన్స్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని జాన్వీ కపూర్‌ పేర్కొంది.

ఎన్టీఆర్‌ తో కలిసి నటించే అవకాశం రావడంతో నా కోరిక తీరింది. ప్రస్తుతం ఆయనతో కలిసి షూటింగ్‌ లో పాల్గొంటూ ఉండటం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ తో నటించాలనే కోరిక తీరిందని.. అయితే హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్‌ లతో కలిసి నటించాల ని ఉందంటూ కూడా జాన్వీ కపూర్ పేర్కొంది.

ఇక బాలీవుడ్‌ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో అయినా నటించాలని తన కోరిక అంటూ జాన్వీ కపూర్ పేర్కొంది. మొత్తానికి ఈ అమ్మడి కోరికల జాబితా.. డ్రీమ్‌ ప్రాజెక్ట్ ల జాబితా చాలా పెద్దగానే ఉంది. దేవర సినిమా సక్సెస్ అయితే ఈమెకు టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల కు జోడీగా నటించే అవకాశాలు దక్కవచ్చు.