Begin typing your search above and press return to search.

పీకాక్ పై జాన్వీ ధ‌గ‌ధ‌గలు జివ్వు మ‌నిపించేలా!

తాజాగా అమ్మ‌డు పీకాక్ క‌వ‌ర్ పేజీపై జాన్వీ మెరుపు..మురిపం నెక్స్ట్ లెవ‌ల్ అనొచ్చు. డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ స్టైల్ కా బాప్ అనిపించింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 8:30 PM GMT
పీకాక్ పై జాన్వీ ధ‌గ‌ధ‌గలు జివ్వు మ‌నిపించేలా!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీక‌పూర్ ఫ్యాష‌న్ ఎంపికల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైలిష్ ఎంపిక‌ల్లో తానో బ్రాండ్ అని తొలి నాళ్ల‌లో ముద్ర వేసేసింది. అటుపై న‌టిగా ప‌రిణితి చెందుతోన్న క్రమం కొద్ది ఎంపిక‌ల్లో మ‌రింత యూనిక్ స్టైల్ ని అనుస‌రించ‌డం మొద‌లు పెట్టింది. బ్యూటీ ప‌రంగా ఎలివేష‌న్ కోసం అమ్మ‌డు స‌రిహ‌ద్దులు ఎప్పుడో దాటిపోయింది. విదేశీ మోడ‌ల్స్ నే త‌ల‌పించేలా? ఎన్నో ఎంపిక‌ల్లో మెరిసింది.

తాజాగా అమ్మ‌డు పీకాక్ క‌వ‌ర్ పేజీపై జాన్వీ మెరుపు..మురిపం నెక్స్ట్ లెవ‌ల్ అనొచ్చు. డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ స్టైల్ కా బాప్ అనిపించింది. పింక్ అండ్ రెడ్ కాంబినేష‌న్ ఎంపిక‌లో ఎంతో ఆక‌ర్షణీయంగా హైలైట్ అవుతుంది. గులాబీ రంగు బాట‌మ్ పై మ్యాచింగ్ టాప్ ధ‌రించి ఆద్యంతం స్కిన్ షోని హైలైట్ చేసింది. ఆ డిజైన‌ర్ ని మ‌రింత అందంగా తీర్చిదిద్దేలా ఎరుపు రంగు ప్లోర‌ల్ ఎంపిక మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మ‌లిచింది. ఇక జాన్వీ ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ..హెయిర్ స్టైల్..అలంక‌ర‌ణ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి.

ఇప్ప‌టికే అమ్మ‌డు పీకాక్ కోసం చాలా సంద‌ర్భాల్లో ఫోటో సెష‌న్లు ఇచ్చింది. డిజైన‌ర్ దుస్తుల్లో వివిధ భంగిమ‌ల్లో జాన్వీ అందాల‌తో కుర్ర‌కారుని ఆక‌ర్షించిన సంద‌ర్భాలెన్నో. పీకాక్ క‌వ‌ర్ పేజీలు అంటేనే బాలీవుడ్ భామ‌ల‌కు ఓ బ్రాండ్. జాన్వీలాంటి ఫేం ఉన్న బ్యూటీ మెరిసిందంటే? మ‌రింత సంచ‌ల‌న‌మే.ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. జాన్వీ అభిమానులు ఆమె అందాన్ని పొగిడేస్తూ ర‌క‌ర‌కాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక జాన్వీ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, హిందీ అంటూ రెండు భాష‌ల్ని దున్నేస్తుం ది . యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న 'దేవ‌ర‌'లో న‌టిస్తోంది. ఇది పూర్తి కాగానే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా చేయ‌నుంది. జాన్వీ ఊ కొట్టాలేగానీ ఇంకా చాలా మంది హీరోలు, ద‌ర్శ‌కులు వెయిట్ చేస్తున్నారు.