Begin typing your search above and press return to search.

చుట్టమల్లే ట్రోల్స్.. అసలు జాన్వీ ఏమందంటే..

దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Aug 2024 8:25 AM GMT
చుట్టమల్లే ట్రోల్స్.. అసలు జాన్వీ ఏమందంటే..
X

దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ కి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్యూర్ మెలోడీ బీట్ తో సాగే ఈ రొమాంటిక్ విరహగీతంలో జాన్వీ కపూర్ ని కొరటాల శివ చాలా గ్లామరస్ గా చూపించారనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇప్పటికే 50 మిలియన్స్ కి పైగా వ్యూవ్స్ అందుకోవడం విశేషం. అనిరుద్ రవిచందర్ దేవర సినిమాకి అద్భుతమైన సాంగ్స్ ని అందిస్తున్నాడనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ఫియర్ సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువగా చుట్టమల్లే సాంగ్ కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

యుట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి నెంబర్ వన్ స్థానంలో నడుస్తోంది. మధ్యలో కాస్త ట్రోల్స్ వచ్చినా ఆ విషయంను మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. హీరోయిన్ కూడా అవేమి పట్టించుకోకుండా కేవలం పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది. తాజాగా ఈ సాంగ్ కి వస్తోన్న రెస్పాన్స్ పై జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యింది. చుట్టమల్లే సాంగ్ కి ట్రోలింగ్ రానందుకు చాలా హ్యాపీగా ఉందని జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నెగిటివ్ ట్రోల్స్ వస్తాయేమో అని భయపడ్డాను. కానీ సాంగ్ కి వస్తోన్న స్పందన చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది.

తన డాన్స్ తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుందనే ఫీడ్ బ్యాక్ పబ్లిక్ నుంచి వస్తోందని తెలిపారు. ఈ సాంగ్ పై అప్పుడే సోషల్ మీడియాలో షార్ట్స్ క్రియేట్ చేసి విపరీతంగా షేర్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా వీటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీని జాన్వీ కపూర్ ఎక్స్ పెక్ట్ చేసింది. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకున్న తెలుగు ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా సక్సెస్ తో స్వాగతం చెబుతారని జాన్వీ కపూర్ భావించింది.

దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ అందానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సాంగ్ తో మూవీ పైన కూడా అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర మూవీ రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.