Begin typing your search above and press return to search.

దేవ‌ర సాంగ్: జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కి చ‌లి జ్వ‌రమే

ఇక ఈ పాట‌లో జాన్వీ క‌పూర్ ని ఎలివేట్ చేసిన తీరు కానీ, తార‌క్ యంగ్ ఛ‌రిష్మాటిక్ లుక్స్ కానీ ఫ్యాన్స్ లో జ్వ‌రం పుట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 4:46 PM GMT
దేవ‌ర సాంగ్: జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కి చ‌లి జ్వ‌రమే
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అంటే అది ఎంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క‌మో ఊహించిన‌దే. జాన్వీపై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా జాన్వీ క‌పూర్ స‌ర్వం వండి వారుస్తోందన‌డానికి తాజా సాంగ్ గ్లింప్స్ స‌రిపోతుంది. కొన్ని గ‌డియ‌ల పాటు దేవ‌ర నుంచి రెండో పాట 'చుట్ట మల్లె చుట్టేస్తా..' షేక్ చేసింది. జాన్వీతో యంగ్ య‌మ రొమాన్స్ మ‌రో లెవ‌ల్‌లో పండింది. ఇక ఈ పాట‌లో జాన్వీ క‌పూర్ ని ఎలివేట్ చేసిన తీరు కానీ, తార‌క్ యంగ్ ఛ‌రిష్మాటిక్ లుక్స్ కానీ ఫ్యాన్స్ లో జ్వ‌రం పుట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తెలుగు గ్లింప్స్ వైర‌ల్ గా దూసుకెళ్లింది.

ఇదే పాట హిందీ వెర్ష‌న్ గ్లింప్స్ కూడా అంతే వైర‌ల్ గా మారుతోంది. ధీరే ధీరే అంటూ సాగే ఈ పాట‌లో డ్యాన్సింగ్ క్లిప్ ని ఎన్టీఆర్ అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాట కోసం రామ‌జోగయ్య రాసుకున్న లైన్స్ కానీ, ఎంపిక చేసుకున్న లొకేష‌న్స్ కానీ, కొరియోగ్ర‌ఫీ కానీ, గ్లామ‌ర్ ఎలివేష‌న్ కోసం ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్.. ఇలా ప్ర‌తిదీ హైలైట్ గా ఉన్నాయి. క‌చ్ఛితంగా ఇది చ‌లి జ్వ‌రం పుట్టించే పాట అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తుంటే జాన్వీకి ఇంత‌కంటే బెస్ట్ డెబ్యూ వేరొక‌టి ఉండ‌దేమో! అనేంత అందంగా త‌న‌ను ఎలివేట్ చేస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఇన్నాళ్లు జాన్వీని మోడ్ర‌న్ దుస్తుల్లో వీక్షించిన ఆడియెన్ కి ఇలా చీర‌ల్లో, కోక ర‌వికెలో చూస్తుంటే నిజంగానే చ‌లి జ్వ‌రం వ‌స్తోంది.

చాలా హిందీ సినిమాలతో పోలిస్తే జాన్వీని ది బెస్ట్ గా కొర‌టాల శివ ఆవిష్క‌రిస్తున్నార‌ని కూడా భ‌రోసా క‌నిపిస్తోంది. మొత్తానికి జాన్వీ క‌పూర్ కి ఇది సంతృప్తిక‌ర‌మైన డెబ్యూ కాబోతోంద‌న‌డానికి ఈ చిన్న గ్లింప్స్ స‌రిపోతుంది. ఇక పూర్తి సినిమాలో పెద్ద తెర నిండుగా జూనియ‌ర్ అతిలోక సుంద‌రిని చూస్తూ మురిసిపోయేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.

తెలుగులో చుట్టమల్లె, హిందీలో ధీరే ధీరే, తమిళంలో పత్తవైక్కుం, కన్నడలో స్వాతిముత్తే సిక్కంగైతే, మలయాళంలో కన్నినాథన్ కమనోట్టం .. ఇలా అన్ని భాష‌ల‌లో ఈ పాట ఇప్ప‌టికే వైర‌ల్ గా దూసుకెళ్లింది. వెబ్ లో లైక్ లు క్లిక్ ల‌తో హోరెత్తుతోంది. యువ‌త‌రం దీనిని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. శిల్పా రావు గానంతో బాస్కో మార్టిస్ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాట నిడివి 3 నిమిషాల 44 సెకన్లు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు. ఈ పాట‌ను వీక్షించాక .. రొమాంటిక్ ట్రాక్‌తో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ''నాకు సీనియర్ ఎన్టీఆర్ - శ్రీదేవిని గుర్తు చేస్తున్నారు''అని వ్యాఖ్యానించాడు. ఈ పాట చాలా చాలా క్యూట్‌గా ఉందని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు. చాలా మంది జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో పాటను చూసిన తర్వాత జూనియర్ శ్రీదేవి అని వ్యాఖ్యానించారు.