Begin typing your search above and press return to search.

జాన్వీక‌పూర్ కేరింగ్ అంతా ప్రియుడిదేనా?

క‌ల్తీ ఆహారం కార‌ణంగా అస్వ‌స్థ‌కు గురై ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ డిశ్చార్జ్ అయింది

By:  Tupaki Desk   |   21 July 2024 12:30 PM GMT
జాన్వీక‌పూర్ కేరింగ్ అంతా ప్రియుడిదేనా?
X

క‌ల్తీ ఆహారం కార‌ణంగా అస్వ‌స్థ‌కు గురై ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ డిశ్చార్జ్ అయింది.ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సోదరి ఖుషీకపూర్- బాయ్‌ఫ్రెండ్ షిఖర్ పహారియా పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. ప్ర‌స్తుతానికి బాగా నీర‌సంగా ఉంద‌ని ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటుంద‌ని అన్నారు. అలాగే పూర్తిగా కోలుకోవ‌డానికి వారం రోజులు స‌మ‌యం ప‌డుతుం ద‌ని తెలుస్తోంది.

అంత‌వ‌ర‌కూ జాన్వీ ఇల్లు క‌దిలే ప‌రిస్థితి ఉండ‌దు. దీంతో జాన్వీ బాధ్య‌త‌ల‌న్నింటిని ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియా ఇప్ప‌టి నుంచే తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. కొన్ని నెల‌లుగా జాన్వీ-శిక‌ర్ ప‌హారియా ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారో తెలిసిందే. క‌లిసి పార్టీల‌కు వెళ్ల‌డం, గుడులుగోపురాలు చుట్టేయడం, అంబానీ ఇంట వివాహా వేడుక‌కు జంట‌గా హాజ‌ర‌వ్వ‌డం ఒకటేంటి? ప‌హారియా ఎప్పుడు చూసినా జాన్వీ వెంట‌నే క‌నిపిస్తున్నాడు.

జాన్వీ కూడా అత‌డికి అంతే ప్రాధాన్య‌త ఇస్తుంది. ఇంట్లో ఫ్యామిలీ మెంబ‌ర్ అయిపోయాడ‌ని ఎప్పుడో చెప్పేసింది. ఎమెర్జెన్సీ కాల్ లిస్ట్ లో ముందుగా అత‌డి నెంబ‌ర్ ఉంటుంద‌ని చెప్పింది. అప్పుడే అర్ద‌మైంది ఇద్ద‌రు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ వాకింగ్ ర‌న్నింగ్ చేస్తుంది. కాబ‌ట్టి జాన్వీ తాజా ప‌రిస్థితుల్లో కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప‌హారియాపై అంతే ఉంది. అక్క అంటే ఖుషీక‌పూర్కి అంతే ఇష్టం. ఇద్ద‌రు అక్కా-చెల్లికంటే క్లోజ్ ప్రెండ్స్ గా ఉంటారు. పార్టీలు..ప‌బ్ ల్లో ఎంజాయ్ చేయ‌డంలో సిస్టర్స్ చాలా చ‌లాకీగా ఉంటారు. ఇక జీన్వీ క‌పూర్ , ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `దేవర` సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే, రామ్ చరణ్ తదుపరి సినిమాకు కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.