పూజలో ప్రియుడితో జాన్వీ కపూర్ సందడి!
ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి జంటగా అనంత్ ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో జాన్వీ ఎంతో అందంగా ముస్తాబైంది
By: Tupaki Desk | 11 July 2024 7:14 AM GMTఅనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే ఐదు నెలలుగా నెలకొ ఈవెంట్ చొప్పున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక పెళ్లికి వారం రోజులకు ముందుగా అయితే ఆ సెలబ్రేషన్స్ పీక్స్ కి చేరాయి. సంగీత్ వేడుక...అటుపై జరిగిన శివ శక్తి పూజకు కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పూజ కోసం జాన్వీకపూర్ ప్రత్యేకంగా హాజరైనట్లు తెలుస్తోంది.
ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి జంటగా అనంత్ ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో జాన్వీ ఎంతో అందంగా ముస్తాబైంది. సంప్రదాయ దుస్తుల్లో జాన్వీ ఎంతో ఆకర్షణీయంగా తాయారైంది. మెడలో హారం, నడుముకు డిజైనర్ వడ్డానం వేసుకుంది. రెండు చేతులకు డ్రెస్ మ్యాచింగ్ బేంగిల్స్ ధరించిం చింది పహారియా శర్వానీ దుస్తుల్తో మనోహారంగా ముస్తాబయ్యాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న పిక్ లో ఇద్దర్నీ గమనించవచ్చు.
శిఖర్ పహారియా ముందు నడుస్తుంటే జాన్వీ అతడి వెనకాలే నడుచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పెళ్లి విషయంలో జాన్వీ చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి అంతా నాదే అన్నట్లు హంగామా చేసింది. సంగీత్ కార్యక్రమంలో శిఖర్ పహారియాతో కలిసి డాన్సులేసి అలరించింది. తాజాగా నిన్నటి రోజున పూజా కార్యక్రమానికి జంటగా హాజరవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది.
దీంతో ఆ కుటుంబంతో జాన్వీ అండ్ కోస ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుందన్నది అర్దమవుతుంది. ఇక రేపు జరగబోయే పెళ్లిలో అమ్మడు ఇంకెత హంగామా చేస్తుందో చూడాలి. పహారియాతో జాన్వీ పీకల్లోతు లవ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అతడికి తానెంత ప్రాధాన్యత ఇస్తుందన్నది రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈజోడీ కూడా అతి త్వరలోనే పెళ్లి పీఠలెక్కే అవకాశం లేకపోలేదు.