Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కలర్ ఫుల్‌ కపూర్ అందం

తాజాగా జాన్వీ కపూర్ మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ లో కలర్ ఫుల్‌ అందాలతో కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   11 July 2024 12:30 PM GMT
పిక్ టాక్ : కలర్ ఫుల్‌ కపూర్ అందం
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. కెరీర్‌ ఆరంభించి చాలా కాలం అయినా ఇప్పటి వరకు కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా అందాల ఆరబోత పోటోల వల్ల రెగ్యులర్‌గా ఆఫర్లు సొంతం చేసుకుంటూనే ఉంది.

బాలీవుడ్ లో ఇప్పటి వరకు హిట్‌ కొట్టలేక పోయిన జాన్వీ కపూర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ ల సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తున్న కారణంగా ఒక్కసారిగా ఈమె కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకబోతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

దేవర సినిమాలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న జాన్వీ కపూర్‌, బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో చరణ్‌ తో కలిసి రొమాన్స్ కి జాన్వీ కపూర్ రెడీ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఎన్నో సార్లు తన ఫోటో షూట్స్ తో చెప్పకనే చెప్పింది.

తాజాగా జాన్వీ కపూర్ మరోసారి తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ లో కలర్ ఫుల్‌ అందాలతో కన్నుల విందు చేసింది. సాధారణంగా ఇలాంటి ఔట్‌ ఫిట్‌ లో జాన్వీ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

మల్టీ కలర్‌ ఔట్‌ ఫిట్‌ లో జాన్వీ కపూర్ మెరుస్తోంది అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తూ, లవ్‌ ఈమోజీ లను షేర్‌ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ మరియు షేర్స్ ను దక్కించుకున్న కలర్‌ ఫుల్‌ కపూర్‌ అందంను మీరు ఒక లుక్కేయండి.