Begin typing your search above and press return to search.

ప్యారిస్ ప్యాష‌న్ వీక్ లో జాన్వీ ధ‌గ‌ధ‌గ‌లు!

ఫ్యాషన్ వ‌ర‌ల్డ్ లో జాన్వీక‌పూర్ ఎంపిక‌లు ఎప్పుడూ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంటాయి.

By:  Tupaki Desk   |   7 July 2024 5:30 PM GMT
ప్యారిస్ ప్యాష‌న్ వీక్ లో జాన్వీ ధ‌గ‌ధ‌గ‌లు!
X

ఫ్యాషన్ వ‌ర‌ల్డ్ లో జాన్వీక‌పూర్ ఎంపిక‌లు ఎప్పుడూ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంటాయి. రెగ్యుల‌ర్ ఔట్ ఫిట్స్ ని ప‌క్క‌న‌బెడితే క‌వ‌ర్ పేజీల షూట్లో జాన్వీ మెరిపులు అసాధార‌ణంగా ఉంటాయి. ష్యాష‌న్ డిజైన‌ర్ల ఎంపిక‌ల్లో జాన్వీ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే అమ్మ‌డు షోలు ఎన్నో చేసింది. విదేశీ వేదిక‌ల‌పై మెరిసింది త‌క్కువే గానీ..మెరిపించిన కొన్ని సంద‌ర్భాల్లోనైనా డిఫ‌రెంట్ డిజైన‌ర్స్ లో తానో బ్రాండ్ బ్యూటీ గా ప్రూవ్ చేసింది.


తాజాగా అమ్మ‌డు 2024 పారిస్ ఫ్యాష‌న్ వీక్ లో ఓ రేంజ్ లో హైలైట్ అయింది. సొగ‌స‌రి స్టైలిష్ లుక్ ఆహుతుల్ని మైమ‌రిపించింది. `ఆరా` బ్రాండ్ హోల్ గ్రాపిక్ టోన్ డిజైన‌ర్ వేర్ లో పై , కోఆర్డినేటింగ్ ఐరిడెసెంట్ మెర్‌మైడ్ ట్రయిల్-స్కర్ట్‌లో జాన్వీ ధ‌గ‌ధ‌గ‌లు మామూలుగా హైలైట్ కాలేదు. స్ట్రాప్ లెస్ బ్లౌజ్ లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. దీనికి త‌గ్గ‌ట్టు జాన్వీమ్యాక‌ప్, కేశాలంకార‌ణ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాయి.


అచ్చంగా ఈ డిజైన‌ర్ లో మత్స్య క‌న్య‌నే త‌ల‌పించింది. టాప్ టూ బాట‌మ్ జాన్వీ ఎంపిక చేసుకున్న డిజైన్ నెక్స్ట్ లెవ్ లో అనొచ్చు. ప్ర‌ముఖ డిజైన‌ర్ రాహుల్ మిశ్రాకు మ‌ద్ద‌తుగా పారిస్ ప్యాష‌న్ వీక్ లో ఇలా మెరిసింది. ఈ లుక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఒక్క క్ష‌ణం అంతా స్ట‌న్ అయిపోతున్నారు. ఆమె మ‌న జాన్వీనా? అంటూ సందేహ ప‌డుతున్నారు. జాన్వీని అలా చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వంటూ పోస్టులు పెడుతున్నారు.


ఇక జాన్వీ కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ రెండు భాష‌ల్ని దున్నేస్తుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న `దేవ‌ర‌`లో న‌టిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలో కూడా ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ లో సినిమాల‌తోనూ బిజీగా ఉంది.