జాన్వీ కపూర్ ఆ నటిని ఫాలో అవుతుందా?
ఇక్కడా వేగంగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమ్మడి లైనప్ ఎలా ఉందో తెలిసిందే. రిలీజ్ కాకుండా కొత్త అవకాశాలు అందుకుంటోంది
By: Tupaki Desk | 18 April 2024 7:16 AM GMTజాన్వీకపూర్ కెరీర్ ని తెలివిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తోంది. 'ధడక్' తో లాంచ్ అయిన అమ్మడు పీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపుకు రావడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. మామ్ కి ఉన్న క్రేజ్ తో ఆ తరహా అవకాశాలు తొందరగానే వచ్చాయి. కానీ వాటిలో జాన్వీ మార్క్ వేసిందైతే లేదు. అలాగని జాన్వీ తాను పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా పెడుతుంది. శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంది. దేనికైనా టైమోస్తుంది అంటారు? అలా జాన్వీ బ్లాస్ట్ అయ్యే సమయం ఇంకా రానట్లు కనిపిస్తుంది. ఇది గమనించిన జాన్వీ తెలివిగా టాలీవుడ్ లో కూడా లాంచ్ అయింది.
ఇక్కడా వేగంగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమ్మడి లైనప్ ఎలా ఉందో తెలిసిందే. రిలీజ్ కాకుండా కొత్త అవకాశాలు అందుకుంటోంది. అలాగేని హిందీ సినిమాలు లైట్ తీసుకోలేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో 'ఉలజ్' అనే సినిమా చేస్తుంది. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కదు.
బయటకు రాలేని ఆ విష వలయం నుంచి ఎలా బయట పడిందనేది స్టోరీ. శుభాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో జాన్వీ మాత్రమే కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి హీరో లేకుండా తెరకెక్కుతుంది. జాన్వీ ఈ సినిమాలో పోషించిన పాత్రనే గతంలో రాజీ సినిమాలో అలియాభట్ కూడా పోషించినట్లు తెలుస్తుంది. పాకిస్థాన్ అధికారి ఇంటికి కోడలిగా వెళ్లి అక్కడి రహస్యాలను తెలుసుకునే సీక్రెట్ ఏజెంట్ గా అలియా భట్ మంచి సక్సెస్ అయింది. ఆ సినిమాకి అవార్డులు..రివార్డులు కూడా వరించాయి.
'ఉలజ్' కాన్సెప్ట్ కూడా అలాగే ఉండటంతో? కథ పరంగా కొత్తదనం ఎక్కడ? అన్న విమర్శ అప్పుడే తెరపైకి వస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో స్పై కాన్సెప్ట్ లు ఎక్కువవుతున్నాయని..ఆ తరహా సినిమాలు పెద్దగా ఫలితాలు సాధించని వైనం కనిపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద మరీ పేలవమైన వసూళ్లు సాధిస్తున్నాయి. మరి జాన్వీ ఉలజ్ లో తనని తాను కొత్తగా ఎలా ఆవిష్కరించుకుంటుంది? ప్రేక్షకుల్ని ఎంతవరకూ ఎంగేజ్ చేయగలదో ? రిలీజ్ తర్వాత గానీ క్లారిటీ రాదు.