Begin typing your search above and press return to search.

జాన్వీ.. దేవర, RC 16 కంటే ముందే ఇలా..

గుంజన్ సక్సేనా బయోపిక్ గా అదే టైటిల్ తో వచ్చిన మూవీలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసింది.

By:  Tupaki Desk   |   20 April 2024 4:57 AM GMT
జాన్వీ.. దేవర, RC 16 కంటే ముందే ఇలా..
X

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అనే ఇమేజ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. కూతురుని హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించింది. అయితే తల్లి పేరు నిలబెట్టాలని, ఆమెకి సరైన వారసురాలిని అనిపించుకోవాలని జాన్వీ కపూర్ ప్రయత్నం చేస్తూనే ఉంది. మొదటి సినిమా ధఢక్ తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు రెండో ప్రయత్నంలోనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసింది.

గుంజన్ సక్సేనా బయోపిక్ గా అదే టైటిల్ తో వచ్చిన మూవీలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ చేసింది. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తరువాత హిందీలో ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలతోనే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమెకి కమర్షియల్ సక్సెస్ అయితే రాలేదు. తెలుగులో జాన్వీ కపూర్ ని పరిచయం చేయాలని తండ్రి బోనీ కపూర్ చాలా రోజులుగా ప్రయత్నం చేశారు.

ఫైనల్ గా ఒకేసారి రెండు పెద్ద సినిమాల ఆఫర్స్ టాలీవుడ్ లో జాన్వీ ఛాన్స్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర చిత్రంలో నటిస్తోంది, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా RC16లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు చిత్రాలపై జాన్వీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే హిందీలో తాజాగా మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీతో జాన్వీ కపూర్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతోంది.

ఉలజ్ అనే సినిమాకి సంబందించిన టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఇండియన్ అంబాసిడర్ గా వేరే దేశానికి వెళ్లి అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా ఉన్న ఆమె ప్రభుత్వం సహకారం లేకుండా ఒంటరిగా తన సమస్య నుంచి ఎలా బయటపడింది అనేది ఈ కథలో భాగంగా ఉన్నట్లు అనిపిస్తోంది. సుధాన్షు సారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

గతంలో రాజీ మూవీలో అలియాభట్ కూడా ఇదే తరహా క్యారెక్టర్ లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలియాభట్ కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీగా రాజీ ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని నిర్మించిన మేకర్స్ ఇప్పుడు ఉలజ్ మూవీ కూడా చేస్తూ ఉండటం విశేషం. అందం, ఆకర్షణ పరంగా ఇప్పటికే జాన్వీ కపూర్ శ్రీదేవిని మించిన ఇమేజ్ సొంతం చేసుకుంది.

అయితే యాక్టర్ గా ఇంకా పూర్తిస్థాయిలో ప్రూవ్ చేసుకోలేదు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి కావాల్సినంత స్కోప్ ఉన్న నేపథ్యంలో కచ్చితంగా జాన్వీ కపూర్ నటిగా బెస్ట్ అనిపించుకుంటుందనే మాట వినిపిస్తోంది. దేవర, RC16 సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోనున్న జాన్వీ కపూర్ కి నటిగా ఉలజ్ లాంటి మూవీస్ మంచి గుర్తింపు తీసుకొస్తాయని చెప్పొచ్చు.