Begin typing your search above and press return to search.

కాన్ఫిడెన్షియల్ ఫైల్ తో ఇంటెన్స్ లుక్ లో జాన్వీ!

మూవీలో ప్రధాన పాత్రధారుల క్యారక్టర్ పోస్టర్లను తాజాగా జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. "ప్రతి పుకారు ఒక అబద్ధం.

By:  Tupaki Desk   |   19 July 2024 1:29 PM GMT
కాన్ఫిడెన్షియల్ ఫైల్ తో ఇంటెన్స్ లుక్ లో జాన్వీ!
X

ఇటీవల 'మిస్టర్ & మిసెస్ మహి' అనే రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాతో వచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌.. ఇప్పుడు ''ఉలాజ్‌'' అనే స్పై థ్రిల్లర్ మూవీతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఇప్పటికే 'ఉలఝ్‌' చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. మూవీలో ప్రధాన పాత్రధారుల క్యారక్టర్ పోస్టర్లను తాజాగా జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. "ప్రతి పుకారు ఒక అబద్ధం. ప్రతి స్నేహితుడు ఒక ఉచ్చు. ప్రతి క్లూ ఒక ద్రోహం" అంటూ క్యాప్షన్ పెట్టింది.

'ఉలాజ్‌' సినిమాలో సుహానా భాటియా అనే యువ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పాత్రలో జాన్వీ నటించింది. ఆమె లండన్ ఎంబసీలో పని చేసే యంగెస్ట్ డిప్యూటీ హై కమిషనర్‌గా కనిపించనుంది. ఇప్పుడు లేటెస్టుగా ఆమె పంచుకున్న ఫోటోలలో జాన్వీ దేశ రహస్యాలను సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్ ను దాచడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఇతర ఫోటోలలో గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ, మీయాంగ్ చాంగ్, రాజేష్ తైలాంగ్ ఇంటెన్స్ గా చూస్తున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన సుహానా భాటియా.. చిన్న వయసులోనే లండన్‌‌‌‌ రాయబార కార్యాలయంలో డిప్యూటీ హై కమిషనర్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ కు ఎంపికైనట్లు 'ఉలఝ్‌' ట్రైలర్ లో చూపించారు. అయితే ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌‌‌‌, ఇంటి పేరు, నెపోటిజం వల్లనే అంత పెద్ద పదవి దక్కిందంటూ సహోద్యోగులు విమర్శిస్తారు. దేశ రక్షణ కోసం పని చేసే ఇలాంటి విభాగంలో ఆమె టాలెంట్‌ పనికిరాదని కామెంట్లు చేస్తారు.

అలాంటి సమయంలో సుహానాకు ఓ అండర్ కవర్ ఏజెంట్ నుంచి సవాలు ఎదురవుతుంది. ఎంబసీ నుంచి దేశ భద్రతకు సంబంధించిన ఓ రహస్య సమాచారం లీక్ అవ్వడం, కొన్ని గంటల పాటు ఆమె కనిపించకపోవడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తారు. సుహానా దాన్నుంచి బయటపడి తన నిజాయితీని ఎలా నిరూపించుకుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? మిత్రులెవరో శత్రువులెవరో అనేది ఎలా కనుక్కుంది? వంటి విషయాలు తెలియాలంటే 'ఉలాజ్‌' సినిమా చూడాల్సిందే.

'ఉలాజ్‌' చిత్రాన్ని నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్ సుధాంషు సరియా తెరకెక్కించారు. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మించారు. ఇది ఆగస్టు 2వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అతిలోక సుందరి కూతురు ఈ సినిమాతో హిట్టు కొట్టి, గ్రాండ్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జాన్వీ కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే 'RC 16' లో రామ్ చరణ్ కు జోడీగా చేస్తోంది. ఇదే క్రమంలో నాని సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.