Begin typing your search above and press return to search.

డిజైన‌ర్ చోళీతో జివ్వ‌నిపిస్తున్న జాన్వీ!

ఈ సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌వుతుండ‌డంతో ఇది జాన్వీ కెరీర్ కి క‌లిసి రానుంది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 1:58 PM GMT
డిజైన‌ర్ చోళీతో జివ్వ‌నిపిస్తున్న జాన్వీ!
X

అందానికి అందం ప్ర‌తిభ‌తో మైమ‌రిపిస్తోంది జాన్వీ క‌పూర్. ధ‌డ‌క్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఇప్ప‌టికే డ‌జ‌ను చిత్రాల్లో న‌టించేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ డెబ్యూ మూవీ దేవ‌ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ‌వుతుండ‌డంతో ఇది జాన్వీ కెరీర్ కి క‌లిసి రానుంది.


మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోను జాన్వీ క‌పూర్ స్పీడ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇన్ స్టా వేదిక‌గా జాన్వీ షేర్ చేసిన ట్రెడిష‌న‌ల్ ఫోటోషూట్ దుమారం రేపుతోంది. ఒక అంద‌మైన డిజైన‌ర్ లెహంగా దానికి కాంబినేష‌న్ గా ధ‌రించిన డిజైన‌ర్ చోళీ ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. పింక్ అండ్ డార్క్ బ్లూ మిశ్ర‌మ రంగుతో ఈ డిజైన‌ర్ లెహంగా చోళీ చేతి వృత్తి కారులు రూపొందించిన క‌ళంకారి త‌ర‌హా డ్రెస్ కావ‌డంతో ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. ఎంపిక చేసుకున్న సాంప్ర‌దాయ దుస్తుల్లో జాన్వీ చిరున‌వ్వులు చిందిస్తూ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

జాన్వీ త‌దుప‌రి కోలీవుడ్ లోను అడుగు పెట్ట‌నుంద‌ని స‌మాచారం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క‌ర్ణ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో కర్ణుడిగా సూర్య న‌టిస్తుండ‌గా, అత‌డి స‌ర‌స‌న క‌థానాయికగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసార‌ని ఇటీవ‌ల ప్రచార‌మైంది. అయితే దీనిపై అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. టాలీవుడ్ లో దేవ‌ర‌లో న‌టిస్తున్న ఈ భామ‌ సూర్య లాంటి అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంటే అది సౌత్ లోకి ఘ‌న‌మైన ఆరంగేట్రంగానే చెప్పుకోవ‌చ్చు.