మామ్‌కి జాన్వీ అలాంటి ప్రామిస్ !
ఏదైనా పాత్ర కోసం గుండు కొట్టించడం లేదా హెయిర్‌ని కట్ చేయించడం వంటివి చేయలేనని తెలిపింది.
By: Tupaki Desk | 1 Aug 2024 3:44 PM GMT2018లో `ధడక్` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నాయిక హోదాను అందుకునే ప్రయత్నంలో ఉంది. జాన్వీ ఇటీవల స్క్రిప్ట్‌లను చాలా తెలివిగా ఎంచుకుంటోంది. అంతే కాదు.. జాన్వీ కట్టుబాట్లకు తగ్గట్టు నిబద్ధత ఎలా ఉన్నా కానీ ఏదైనా ఒక పాత్ర కోసం తలను కత్తిరించుకునేందుకు, రాజీపడలేనని అంటోంది. ఏదైనా పాత్ర కోసం గుండు కొట్టించడం లేదా హెయిర్‌ని కట్ చేయించడం వంటివి చేయలేనని తెలిపింది.
ఫిల్మ్‌ఫేర్‌కి ఇటీవల ఇచ్చిన త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన దివంగత తల్లి, అతిలోక సుందరి శ్రీదేవికి చేసిన వాగ్దానం గురించి ఓపెనైంది. జాన్వీ తన జుట్టును ఎప్పటికీ కత్తిరించనని, పాత్ర కోసం అయినా అలా చేయను అని తన తల్లికి ప్రామిస్ చేసింది. శ్రీదేవితో తన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ.. గతంలో ఒకసారి తన జుత్తును చిన్నగా కత్తిరించుకున్నందుకు చీవాట్లు తిన్నానని తెలిపింది. `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` సినిమా కోసం ఒకప్పుడు తన జుట్టును చిన్నదిగా కత్తిరించుకున్నానని చెప్పింది. దీనిని చూసిన శ్రీదేవి భవిష్యత్తులో తన జుట్టును ఇంత పొట్టిగా కత్తిరించుకోవద్దని జాన్వీని కోరింది. జాన్వీ 2018లో గుంజన్ సక్సేనా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ``మామ్ గతంలో నన్ను హెచ్చరించింది. నువ్వు నీ జుట్టును ఎప్పటికీ కత్తిరించనని వాగ్దానం చేయి!`` అని కోరింది. నేను నా జుట్టును కత్తిరించడం నాకు కూడా నచ్చలేదు. నేను సినిమాలలో బట్టతలతో నటించలేను! అని కూడా జాన్వీ అంది.
జాన్వీ కపూర్ తాజా చిత్రం `ఉలజ్` విడుదలకు సిద్ధంగా ఉంద. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. లండన్ రాయబార కార్యాలయంలో స్పైగా ప్రవేశించాక కుట్రలో చిక్కుకున్న యువ దౌత్యవేత్తగా జాన్వీ నటించింది. మొదటిసారిగా ఒక దౌత్యవేత్తగా సవాలుతో కూడిన పాత్రలో నటించింది. సుధాన్షు సరియాతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతడు సుహానా పాత్రను నా స్వయం హద్దులు దాటేలా చేసాడు. నేను ఒక ప్రామాణికమైన నటనను అందించడానికి నాకు సహాయపడిన పాత్ర ఇది`` అని తెలిపారు. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మీయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర తదితరులు నటించారు. పర్వీజ్ షేక్, సుధాన్షు సరియా దీనికి రచయితలు ఉలజ్ 2 ఆగస్ట్ 2024న థియేటర్లలోకి రానుంది.