Begin typing your search above and press return to search.

అలియాభ‌ట్ స్థానాన్ని జాన్వీక‌పూర్ భ‌ర్తీ చేస్తుందా?

కానీ అలియా బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టే క్ర‌మంలో ఆ ఛాన్స్ తీసుకోలేదు. స‌రిగ్గా ఇదే స‌మయంలో జాన్వీ లో 'దేవ‌ర' ఛాన్స్ అందుకోవ‌డం తో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 11:30 AM GMT
అలియాభ‌ట్ స్థానాన్ని  జాన్వీక‌పూర్ భ‌ర్తీ చేస్తుందా?
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ జ‌ర్నీ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. తండ్రి బోనీ క‌పూర్ సూచ‌న‌లు..స‌ల‌హాలు పాటిస్తూ ప్ర‌యాణం సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 'దేవ‌ర‌'తో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టిస్తోంది. ఈసినిమా సెట్స్ లో ఉండ‌గానే అమ్మ‌డికి తెలుగు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి.

జాన్వీతో రొమాన్స్ త‌దుప‌రి ఏ హీరో తీసుకుంటాడు? అన్న గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఈ రేసులో ఉండాల్సింది అలియాభ‌ట్. 'ఆర్ ఆర్ ఆర్' విజ‌యం త‌ర్వాత చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ సినిమాల్లో అవ‌కాశాలు ఆమెకే ముందుగా వ‌చ్చాయి. కానీ అలియా బాలీవుడ్ పై ఫోక‌స్ పెట్టే క్ర‌మంలో ఆ ఛాన్స్ తీసుకోలేదు. స‌రిగ్గా ఇదే స‌మయంలో జాన్వీ లో 'దేవ‌ర' ఛాన్స్ అందుకోవ‌డం తో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది.

అలియాభ‌ట్ కి వ‌స్తోన్న అవ‌కాశాలు జాన్వీ అందుకుని ఆస్థానాన్ని భ‌ర్తీ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. దీనికి సంబంధించి జాన్వీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. వెనుక చాణుక్యుడు లాంటి తండ్రి బోనీ క‌పూర్ ఉన్నాడు. ఏ హీరోతో న‌టించాలి? ఎలాంటి క‌థ‌కి సైన్ చేయాలి? ఎలాంటి బ్యాన‌ర్ లో చేయాలి? వంటి వాటిలో నిష్ణాతుడు. ఆయ‌న స‌ల‌హాలు తీసుకుంటూ జాన్వీ టాలీవుడ్ లో కూడా ముందుకెళ్తుంది.

తెలుగులో కూడా ఆమెని పెద్ద హీరోయిన్ చేయాల‌న్న‌ది క‌ల‌. శ్రీదేవి టాలీవుడ్ లో ఎంత పేరు సంపాదిం చిందో కుమార్తె కూడా ఆమె లెగ‌స్సీని అందుకోవాల‌ని భ‌ర్త‌గా ఆశ‌ప‌డుతున్నారు. అందుకే జాన్వీ ప్ర‌తీ నిర్ణ‌యం వెనుక బోనీ క‌పూర్ ఉన్నారు. ఇప్పుడొచ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తండ్రీ-కుమార్తెలిద్ద‌రు సీరియ‌స్ గా ప‌ని చేస్తున్నారు. మ‌రి 'దేవ‌ర' జాన్వీకి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో? ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.