Begin typing your search above and press return to search.

ఇంద్రుని పుత్రిక ఇంద్ర‌జ దిగొచ్చింది!

అంతందంగా రాకుమార్తెను త‌ల‌పిస్తోంది ఈ ఫోటోషూట్ లో. ముత్యాలు, ఛ‌మ్కీల డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ నిజంగా ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:54 AM GMT
ఇంద్రుని పుత్రిక ఇంద్ర‌జ దిగొచ్చింది!
X

అతిలోక సుందరి శ్రీ‌దేవి ఇంద్రుని కుమార్తె ఇంద్ర‌జ‌గా న‌టించి కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ మ‌న‌సులు గెలుచుకుంది. మెగాస్టార్ 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సినిమాలో ఇంద్ర‌లోకం నుంచి భూలోకానికి దిగి వ‌చ్చే దేవాధిదేవుని పుత్రిక‌గా మైమ‌రిపించే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో దేవ‌క‌న్య‌గా శ్రీ‌దేవిని ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు ఆవిష్క‌రించిన తీరు మ‌హ‌దాద్భుతం. స్వ‌ర్గ‌లోక పాల‌కుడు ఇంద్రుని కుమార్తె ఇంత అందంగా ఉంటుందా? అనిపించేంత‌గా శ్రీ‌దేవి రూపం మైమ‌రిపించింది.


అయితే ఇప్పుడు శ్రీ‌దేవి న‌టవార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళుతున్న జాన్వీ క‌పూర్ అందం న‌ట‌న‌లో రోజు రోజుకు షైన్ అవుతున్న తీరు ఆక‌ర్షిస్తోంది. జాన్వీ లుక్ కాలంతో పాటు చాలా మారుతోంది. జాన్వీ తాజా ఫోటోషూట్ అందుకు నిద‌ర్శ‌నం. ఒక‌వేళ ఇంద్రుని పుత్రిక ఇంద్ర‌జ‌గా మ‌ళ్లీ ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? అంటే.. క‌చ్ఛితంగా జాన్వీ క‌పూర్ అయితే బావుంటుంద‌ని ప్ర‌శంసించి తీరాలి. అంతందంగా రాకుమార్తెను త‌ల‌పిస్తోంది ఈ ఫోటోషూట్ లో. ముత్యాలు, ఛ‌మ్కీల డిజైన‌ర్ దుస్తుల్లో జాన్వీ నిజంగా ఎంతో అందంగా క‌నిపిస్తోంది. త‌న‌ను ఇలా చూశాక‌.. ఇంద్రుని పుత్రిక‌గా ఇప్పుడు అర్హ‌త సాధించింది! అంటూ ఈ ఫోటోగ్రాఫ్స్ చూశాక అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. జాన్వీ ఒక డైమండ్ అంటూ కొంద‌రు పొగిడేస్తున్నారు. చాలా మంది అభిమానులు ల‌వ్- హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.


ప్ర‌స్తుతం ఎన్టీఆర్ స‌ర‌స‌న 'దేవ‌ర' చిత్రంలో న‌టిస్తున్న జాన్వీ త‌దుప‌రి రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా 'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు గ‌తంలో వైజయంతి అధినేత‌ అశ్వ‌నిద‌త్ ప్ర‌య‌త్నించారు. అయితే ఈ సీక్వెల్ క‌థాంశం రెడీ కాలేదు. మునుముందు దీనికి ఆస్కారం ఉంటుంద‌నే అంతా ఆశిస్తున్నారు. ఒక‌వేళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ తెర‌కెక్కిస్తే క‌చ్ఛితంగా జాన్వీ పేరు క‌థానాయిక‌గా ప‌రిశీల‌న‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.