జాన్వీ.. రహస్య ప్రియుడు వదిలిన రొమాంటిక్ ఫొటో
ఇక నేడు జాన్వీ కపూర్ బర్త్ డే కావడంతో రాత్రి సమయంలో ఈఫిల్ టవర్ ముందు దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేశాడు.
By: Tupaki Desk | 6 March 2024 3:58 PM GMTబాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదట్లోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన జాన్వీ కపూర్ పెద్దగా సక్సెస్ లు అయితే అందుకోలేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు ఆమెకు పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. తన గ్లామర్ తోనే అమ్మడు ఈ విధంగా అవకాశాలు పెంచుకుంటూ వెళ్తోంది. ఇక పర్సనల్ విషయాలపై ఎప్పుడూ కూడా సరైన క్లారిటీ ఇవ్వని ఈ బ్యూటీ తన రహస్య ప్రియుడు గురించి కూడా ఎప్పుడు పెద్దగా బయటపెట్టింది లేదు.
శిఖర్ పహ్రియా అనే యువకుడితో జాన్వీ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా కథనాలు వస్తున్నాయి. మీడియాలో ఎన్ని గాసిప్స్ వస్తున్నా కూడా ఆ విషయాలను ఆమె పట్టించుకోదు. తన పేరు ఏదో ఒక రకంగా వైరల్ అవుతుంది అని అనుకుంటుందో ఏమో కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు మరింత హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి.
ఎందుకంటే శిఖర్, జాన్వి ప్రేమలో మునిగి తెలుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. లవ్ సింబల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉండడం విశేషం. ఇక నేడు జాన్వీ కపూర్ బర్త్ డే కావడంతో ఈఫిల్ టవర్ ముందు దిగిన ఒక పాత ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో అతను జాన్వీ భుజంపై చేయి వేయగా ఆమె కూడా అతన్నీ చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక ఆ ఫోటోకు లో హ్యాపీ బర్త్ డే అనే క్యాప్షన్ తో పాటు లవ్ ఎమోజి కూడా జత చేశాడు. దీంతో ఆమె బాయ్ ఫ్రెండ్ తో మరింత ప్రేమలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోలో మాత్రం ఆమె ఇచ్చిన సమాధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అసలు ప్రేమలో ఉన్నట్లా లేనట్లా అంటే.. శిఖర్ నాకే కాదు నా కుటుంబ సభ్యులకు కూడా చాలా క్లోజ్ అని, అందరిలా కాకుండా చాలా స్నేహభావంతో ఉంటాడు అని చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. అయితే ఇంతకీ అతనితో ప్రేమ విషయంపై మాత్రం అమ్మడు పూర్తిస్థాయిలో సమాధానం మాత్రం చెప్పలేదు. ఆమె చెప్పకపోయినా కూడా అతను మాత్రం అప్పుడప్పుడు రొమాంటిక్ ఫొటోలతో ఆమె నా పిల్ల అనేలా హింట్ ఇస్తున్నాడు అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
ఇక ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లోనే చేసుకుంటాను అని చాలా సార్లు చెప్పింది. తన తల్లి కోరిక కూడా అదే అని ఆమె ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక నేడు పుట్టినరోజు సందర్భంగా అమ్మడు తిరుపతిలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దర్శనం చేసుకుంది. మరి వీరి బంధంపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో. ప్రస్తుతం ఆమె దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ 16వ సినిమాతో బిజీగా ఉంది.