Begin typing your search above and press return to search.

జిగేల్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ లో జాన్వీ హొయలు

కాగా, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె వివిధ రంగుల దుస్తుల్లో మెరిసిపోయింది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 12:56 PM GMT
జిగేల్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ లో జాన్వీ హొయలు
X

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి కూతురిగా సినిమాల్లోకి రాకముందు నుంచీ పరిచయమే. ఆ హోదాలోనే ఇండస్ట్రీలోనే అడుగుపెట్టింది. జాన్వీ తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఐదేళ్లు అవుతోంది. అయితే, ఇప్పటి వరకు చెప్పుకోదగిన హిట్ మాత్రం అందుకోలేకపోయింది.


తాజాగా, ఈ బ్యూటీ 'బవాల్'అనే మూవీలో నటించింది. ఈ మూవీలో ఆమెకు జోడిగా వరుణ్ ధావన్ నటించారు. సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాగా, బాగానే ఆకట్టుకుంది. దక్షిణాదిన కూడా సత్తా చాటేందుకు ట్రై చేస్తోంది.

కాగా, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె వివిధ రంగుల దుస్తుల్లో మెరిసిపోయింది. అన్నీ జిగేల్ జిగేల్ మనే దస్తులు కావడం విశేషం. ఈ వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్కో రంగు డ్రెస్ లో ఒక్కోలా ముస్తాబై, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం.

ఇక, ఈ బ్యూటీ తెలుగులో దేవర మూవీతో గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. తెలుగులో మొదటి సినిమానే ఆమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీ లుక్ ని గతంలోనే రివీల్ చేశారు. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ లుక్ లో కనిపిస్తుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మరో వైపు ఈ బ్యూటీ తమిళంలోనూ అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా ఒకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.బ్యాలెన్స్డ్ గా అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరసగా, రెండు హిట్లు పడితే, ఇక దక్షిణాదిన జాన్వీ కెరీర్ కి ఎలాంటి డోకా లేదనే చెప్పొచ్చు.