Begin typing your search above and press return to search.

చెలికాడితో క్రూయిజ్ షిప్ పార్టీలో జాన్వీ

సెల‌బ్రిటీలంతా క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంజాయ్ చేస్తూ మాంచి జోష్‌లో క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:42 PM GMT
చెలికాడితో క్రూయిజ్ షిప్ పార్టీలో జాన్వీ
X

ఇటలీలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక‌ల‌ నుండి విజువల్స్‌ ఇంటర్నెట్ లో సందడిగా మారాయి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న‌ వైరల్ వీడియోలో జాన్వీ కపూర్ త‌న బోయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో విలువైన స‌మ‌యం గ‌డుపుతున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఆస‌క్తిక‌రంగా ఇదే పార్టీలో జాన్వీ తండ్రి బోనీకపూర్ ఉన్నారు. జాన్వీతో ఫ్రేమ్ లో ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవతరమణి ఉన్నారు. సెల‌బ్రిటీలంతా క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఎంజాయ్ చేస్తూ మాంచి జోష్‌లో క‌నిపిస్తున్నారు.

జాన్వీ కపూర్ - శిఖర్ పహారియా జంట చిలౌట్ వీడియోని ఓర్యున్‌సీన్ అనే ఇన్‌స్టా ఖాతాదారు షేర్ చేసారు. ఈ కొత్త వీడియో వేగంగా అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది. ఇందులో జాన్వీ కపూర్, శిఖర్ పహారియా, వీర్ పహారియా, బోనీ కపూర్, ఓర్రీ , మానుషి చిల్లర్ ఉన్నారు. ఇది క్రూయిజ్‌లో అరుదైన క్ష‌ణం అని అంతా ప్ర‌శంసిస్తున్నారు. అలాగే ఈ వీడియోలో బోనీ కపూర్‌ హైలైట్‌గా నిలిచారు. వీడియో క్లిప్‌లో ఓర్రీ బోనీని ఆర్ యు ఫిట్? అని అడిగాడు. దానికి బోనీ జెన్ Z లింగో స్టైల్ లో కొంచెం అయోమయంగా కనిపిస్తూ ''అవును, నేనే ఫిట్'' అని చెప్పాడు. ఓర్రీ బోనీ దుస్తులను 'రెడ్ హాట్ చిల్లీ పెప్పర్' అని చ‌తుర‌త‌తో వర్ణించాడు. సెల్ఫీ వీడియోలో ఓర్రీ స‌ర‌దాలు వీడియోలో క‌నిపించాయి. బోనీ ఈ వీడియోలో ఎంతో స‌ర‌దాగా క‌నిపించారు. అయితే క్రూయిజ్ పార్టీలో క‌ళ్ల‌న్నీ జాన్వీ-శిఖ‌ర్ జంట సాన్నిహిత్యంపైనే ఉన్నాయని గుస‌గుస‌లు వినిపించాయి. శిఖ‌ర్ త‌మ కుటుంబంతో ఉంటే ఏదో తెలియ‌ని ఆనందం త‌మ‌తో ఉంటుంద‌ని ఇంత‌కుముందు బోనీ క‌పూర్ త‌న మ‌న‌సులో మాట చెప్పారు. ఆ ర‌కంగా జాన్వీతో అతడి స్నేహానికి ఆ ఇంటి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అందిన‌ట్ట‌యింది. జాన్వీ - శిఖ‌ర్ జంట ప‌లుమార్లు తిరుమ‌లేశుని ద‌ర్శ‌నంలోను క‌నిపించారు. ఆ త‌ర్వాత‌ జాన్వీని విడిచి శిఖ‌ర్ ఉండ‌లేడ‌ని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. జాన్వీ ప్ర‌స్తుతం త‌న తొలి తెలుగు సినిమా దేవ‌ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

క్రూయిజ్ పార్టీ వైభవం:

ఇటాలియన్ క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ మే 29న ప్రారంభమైంది. దాదాపు 800 మంది అతిథులు ఇటలీ నుండి విలాసవంతమైన క్రూయిజ్‌లో ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత స్వాగత భోజనాన్ని ఆస్వాధించారు. దీని తర్వాత స్టార్రీ నైట్ పార్టీ జరిగింది. మరుసటి రోజు 'ఏ రోమన్ హాలిడే' వేడుక జ‌రిగింది. అతిథులు రోమ్‌లో షికారు చేసి, సాయంత్రం స‌ర‌దాల‌తో పార్టీని ముగించారు. చివరి రోజు అంటే జూన్ 1న అతిథులు కేన్స్‌లో మాస్క్వెరేడ్ పార్టీని ఆస్వాధించారు. ఆ తర్వాత 'పార్డన్ మై ఫ్రెంచ్' అనే క్రూయిజ్‌లో తర్వాత పార్టీని ఆస్వాధించారు.

క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఓ వైపు క్రూయిజ్ లో జ‌రుగుతుండ‌గానే.. అనంత్ - రాధికల వివాహ ఆహ్వాన శుభ‌లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంట జూలై 12న పెళ్లి చేసుకోబోతున్నారని స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' వేడుక .. జూలై 14న గ్రాండ్ రిసెప్షన్ జరగనున్నాయి. ముఖేశ్ అంబానీకి చెందిన జియో వరల్డ్ సెంటర్‌లో ఈ మూడు రోజుల ఈవెంట్ జరగనుంది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ కూడా మార్చి 2019లో ఇదే వేదికలో శ్లోకా మెహతాను పెళ్లాడారు.