జాన్వీ పెదాలు తాకిన కోలా టేస్ట్ చేయాలనిపిస్తుందా!
అందుకే నలుగురిలా కాదు...నలుగురిలో తానొక స్పెషల్ అనిపించేలా ట్రీట్ ఇవ్వడం జాన్వీ ప్రత్యేకత.
By: Tupaki Desk | 6 Dec 2023 1:59 PM GMTఅతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ అందాల దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అమ్మడు ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు తనదైన మార్క్ గ్లామర్ ఎలివేషన్లతో యువతని ఆకర్షిస్తుంది. సొగసరి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. మార్కెట్ లో పోటీని ఎదుర్కోవాలంటే స్పెషల్ తప్పనిసరి అంటుంది. అందుకే నలుగురిలా కాదు...నలుగురిలో తానొక స్పెషల్ అనిపించేలా ట్రీట్ ఇవ్వడం జాన్వీ ప్రత్యేకత. తాజాగా అమ్మడు కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో జాన్వీ కొకోకోలా తాగుతూ ఫోజులిచ్చింది. జాన్వీ పెదాల్ని తాకిన కోలా కం జాన్వీ ఇలా వైరల్ అవుతుంది. ఇదేమి కెమారాకిచ్చిన ఫోజు లా లేదు. క్యాజువల్ గా కోలా తాగుతూ ఇలా చిక్కినట్లు కనిపిస్తుంది. ఆ ఫోటో నెట్టింట లీకైనట్లు తెలుస్తుంది. ఇందులో జాన్వీ ఔట్ ఫిట్ లో తనలో బ్యూటీని మరోసారి హైలైట్ చేసింది. కోక్ తాగుతూ అమ్మడు అందంగా కవ్వించేస్తుంది. చూపరులను ఈ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటుంది. జాన్వీ అందాలే మరోసారి హైలైట్ అవుతున్నాయి. ఫోటోపై కామెంట్లు అంతే ఆసక్తికరం.
ఇక జాన్వీ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు భాషల్లోనూ దూసుకుపోతుంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన `దేవర`లో నటిస్తోంది. ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. ఇప్పటివరకూ బాలీవుడ్ చిత్రాలతో మెప్పించిన అమ్మడి కెరీర్ దేవర తర్వాత మారిపోతుంది అన్న అంచనాలున్నాయి. `దేవర`కి కమిట్ అవ్వడం వెనుక జాన్వీ పెద్ద స్థాయిలోనే స్కెచ్ వేసింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిన ఇతర భాషల్లోనూ బిజీ నాయికగా మారాలన్నది ప్లాన్ .
దీనిలో భాగంగానే జాన్వీ ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు మౌల్డ్ అవుతోంది. సౌత్ ఆడియన్స్ టేస్ట్..పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మార్కెట్ బిల్డ్ అవ్వాలంటే? తన నుంచి ఎలాంటి రిమార్క్ లేకుండా జాగ్రత్తలు పడుతుంది. వెనుక తండ్రి బోనీ కపూర్ కూడా సలహాలు పాస్ చేయడంతో ఎక్కడా పొర పాటున కూడా తప్పు జరగకుండా చూసుకుంటుంది.