Begin typing your search above and press return to search.

జాన్వీక‌పూర్ డైట్ అండ్ వ‌ర్కౌట్ షెడ్యూల్!

తాజాగా అమ్మ‌డు ఫిట్ నెస్ ని కాపాడ‌టం కోసం ఎలాంటి వ‌ర్కౌట్లు చేస్తుంది? ఎలాంటి డౌట్ ఫాలో అవు తుంది? వంటి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   15 Feb 2024 11:30 PM GMT
జాన్వీక‌పూర్ డైట్ అండ్ వ‌ర్కౌట్ షెడ్యూల్!
X

అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో స‌క్సెస్ అయిన బ్యూటీ టాలీవుడ్ లోనూ స‌త్తా చాట‌డానికి రెడీ అయింది. 'దేవ‌ర‌'తో త‌న బ్రాండ్ ఇమేజ్ ని ఇక్క‌డా వేయ‌బోతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే అమ్మ‌డు కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియాలో దూసుకుపోతున్న త‌రుణంలో జాన్వీకి ప‌రిశ్ర‌మ పెద్ద పీట వేయ‌డం విశేషం.

ఈ విష‌యంలో శ్రీదేవి మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆమె వేసిన పౌండేష‌న్ తోనే ఇదంతా సాధ్య‌మ‌వుతుంది. ఆ అవ‌కాశాల్ని జాన్వీ తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటోంది. ఇక జాన్వీ కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. న‌వ‌త‌రం నాయిక‌ల్లో జాన్వీ ఈ విష‌యంలో మ‌రింత స్పెష‌ల్ అని చెప్పాలి. తాజాగా అమ్మ‌డు ఫిట్ నెస్ ని కాపాడ‌టం కోసం ఎలాంటి వ‌ర్కౌట్లు చేస్తుంది? ఎలాంటి డౌట్ ఫాలో అవు తుంది? వంటి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

రోజువారీ వ్యాయామాల్లో కార్డియో స్ర్టెంత్‌ ట్రైనింగ్‌ యోగా ఉంటాయి. ఉదయం ముందుగా రన్నింగ్‌.. సైక్లింగ్ లేదా డ్యాన్స్‌తో 45 నిమిషాల కార్డియో సెషన్ ఉంటుందిట‌. దీనివల్ల అదనపు కేలరీలు కరుగు తాయి. స్క్వాట్స్‌.. పుషప్స్‌.. లంగెస్‌.. వెయిట్‌ లిఫ్టింగ్ త‌దిత‌ర వ్యాయామాలు అద‌నంగా చేస్తుందిట‌. వీటివల్ల శరీర సామర్థ్యం పెరుగుతుంది. అటుపై కొంత స‌మ‌యం యోగాకి కేటాయిస్తుందిట‌. దీనివ‌ల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఒత్తిడిని అధిగ మించేదుకు ధ్యానం చేస్తుందిట‌. ఇక జాన్వీ ఫుడ్ మెనూ ఇలా ఉంటుంది.

ఆరోగ్యకరమైన పోషక విలువలు.. పిండి పదార్థాలుగల సమతుల ఆహారం మెనూలో త‌ప్పక ఉంటుందిట‌. ఉదయం లేవగానే నిమ్మరసం తేనె కలిపిన గ్లాసుడు గోరువెచ్చటి నీరు తీసుకుంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు .. బ్రెడ్‌ టోస్ట్‌.. గ్రీన్ టీ తీసుకుంటందిట‌. మధ్యాహ్న లంచ్ లో గ్రిల్‌డ్‌ చికెన్‌ లేదా వెజిటబుల్స్‌.. బ్రౌన్‌ రైస్‌తో ఫిష్‌. సాయంత్రం స్నాక్స్ ప్రూట్ స్మూతీ..బాదం..పిస్తా..జీడిప‌ప్పు త‌ప్ప‌నిస‌రి అట‌. అలాగే డిన్న‌ర్ గాసూప్.. గ్రిల్‌డ్‌ ఫిష్‌ లేదా చికెన్‌ సలాడ్ లాంటి వాటికి ప్రాధాన్య‌త ఇస్తుందిట‌.