బ్లాక్ డిజైన్ లో బంతాడేస్తోన్న జాన్వీ బ్యూటీ!
తాజాగా అమ్మడు అదిరగొట్టే ఆల్ట్రాలుక్ లో దర్శనమిస్తుంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ డిజైన్ లో కుర్రాళ్లకి మత్తెక్కించే భంగిమలో ఫోజులిచ్చింది.
By: Tupaki Desk | 14 Oct 2023 11:01 AM GMTబాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో లాక్ చేయడం పనిగా పెట్టుకుంటుంది. వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం అవుతుంది. మినీ ఫ్రాక్ లో కనిపించినా..మిడ్డీ వేసినా కుర్రాళ్ల మతి చెడాల్సిందే.
తాజాగా అమ్మడు అదిరగొట్టే ఆల్ట్రాలుక్ లో దర్శనమిస్తుంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ డిజైన్ లో కుర్రాళ్లకి మత్తెక్కించే భంగిమలో ఫోజులిచ్చింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ డిజైన్ పై అమ్మడి సౌందర్యం నిగనిగలా డుతుంది. తడిపొడి అందాలతో సలపరం పుట్టిస్తుంది. క్లీవేజ్ నుంచి నడుం అందాల వరకూ ఆరబోతకు అడ్డే లేదని ఆవిష్కరించింది. సొగసైన కళ్లకు ఐటెక్స్..పెదాలపై లైట్ గా అద్దిన లిప్ స్టిక్..ఫేస్ మ్యాకప్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిమిషానికి 72సార్లు కొట్టుకోవాల్సిన గుండె జాన్వీ ఫోటూ చూసే సరికి 100 సార్లు కొట్టుకుంటుం దంటు న్నాడు ఓ ఫాలోవర్. లవ్ సిబల్స్ పోస్ట్ చేసి ప్రపోజ్ చేసేస్తున్నారు. అమ్మడి అందాన్ని తమదైన శైలిలో పొగిడేస్తు న్నారు. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే జాన్వీ బిజీ నటిగా మారి చాలా కాలమవుతుంది.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో బిజీ అయింది. ఎన్టీఆర్ ఆసరసన 'దేవర'లో నటిస్తోంది. ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. ఇప్పటివరకూ బాలీవుడ్ చిత్రాలతో మెప్పించిన అమ్మడి కెరీర్ దేవర తర్వాత మారిపోతుంది అన్న అంచనాలున్నాయి. దేవరకి కమిట్ అవ్వడం వెనుక జాన్వీ పెద్ద స్థాయిలోనే స్కెచ్ వేసింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిన ఇతర భాషల్లోనూ బిజీ నాయికగా మారాలన్నది ప్లాన్ . దీనిలో భాగంగానే అమ్మడు ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు మౌల్డ్ అవుతోంది.