Begin typing your search above and press return to search.

జైలు నుంచి రాగానే జానీకి చరణ్ ఫోన్.. ఏమన్నారంటే?

ఆయన వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణలు చేయగా.. అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 10:30 AM GMT
జైలు నుంచి రాగానే జానీకి చరణ్ ఫోన్.. ఏమన్నారంటే?
X

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆయన వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక ఆరోపణలు చేయగా.. అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. ఇటీవల.. బెయిల్ పై బయటకు వచ్చారు. కొద్దిరోజుల పాటు ఫ్యామిలీతో ఉన్న ఆయన.. ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతున్నారు.

ఇప్పటికే ఆయన కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ లోని నైన్ మాటక్క సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలోని డోప్ సాంగ్ కు ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఆయన మార్క్ క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.

అలా గేమ్ ఛేంజర్ లోని ఓ సాంగ్ కు వర్క్ చేసిన జానీ.. ఇప్పుడు హీరో రామ్ చరణ్ కోసం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జైలు నుంచి బయటకు రాగానే చరణ్ తనకు ఫోన్ చేశారని తెలిపారు. తనకు ధైర్యం ఇచ్చినట్లు చెప్పారు. స్ట్రాంగ్ గా, హెల్దీగా ఉండని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. వేరే విషయాల గురించి ఏం మాట్లాడలేదని తెలిపారు.

వర్క్ పై ఫోకస్ చేయమన్నారని, రిహార్సల్స్ కు వెళ్లి ప్రాక్టీస్ చేయమన్నట్లు చెప్పారు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న సినిమాలోని సాంగ్స్ కోసం చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అవి చేద్దువు అని అన్నారని తెలిపారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందని వెల్లడించారు. ఇప్పుడు జానీ మాస్టర్ కామెంట్స్ వైరల్ గా మారగా.. చరణ్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.

ఆరోపణలు ఉన్నా తమ అభిమాన హీరో.. జానీ మాస్టర్ టాలెంట్ కు ప్రాధాన్యమిచ్చారని కొనియాడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వడం గ్రేట్ అని చెబుతున్నారు. సూపర్ చరణ్ అన్న అని కామెంట్లు పెడుతున్నారు. అయితే తనకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముందులాగే మర్యాద దక్కుతుందని జానీ మాస్టర్ చెప్పారు.

ఇప్పటికే చరణ్ నటించిన అనేక సినిమాలకు జానీ మాస్టర్ వర్క్ చేశారు. రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, గోవిందుడు అందరివాడేలా, బ్రూస్‌ లీ చిత్రాలకు పని చేశారు. ఆయా మూవీల్లో అనేక పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు డోప్ సాంగ్ కూడా అదిరిపోయింది. మరి బుచ్చిబాబు సినిమాలోని సాంగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.