ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ..అక్టోబర్ 3 వరకూ రిమాండ్!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను విచారణలో భాగంగా కోర్టు నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమ తించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Sep 2024 10:52 AM GMTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను విచారణలో భాగంగా కోర్టు నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమ తించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రోజుల కస్టడీలో జానీ మాస్టర్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఈనేపథ్యంలో జానీని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి అక్టోబర్ 3వ తేదీ వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించారు.
దీంతో మళ్లీ ఆయన్ని యధావిధిగా చంచల్ గూడ జైలుకు తరలించారు. బాధిత యువతితో జానీ పరిచయం ఎలా జరిగింది? ఆయన వద్ద ఎంత కాలం పనిచేసింది? ఎలాంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలను ఈ నాలుగు రోజుల పోలీస్ విచారణలో జానీ ఎదుర్కుట్లు సమాచారం. అత్యా చారం ఆరోపణలు రావడం..యువతి కేసు పెట్టిన నేపథ్యంలో జానీ మాస్టర్ పరారైన సంగతి తెలిసిదే.
చివరికి ఆయన్ని గోవాలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని హైదరాబాద్ కి తరలించారు. అనంతరం ఓ రహస్య ప్రదేశంలో కొన్ని గంటల పాటు విచారించి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే విచారణ నిమిత్తం పోలీసులు కోర్టును కోరడంతో నాలుగు రోజులు పోలీస్ రిమాండ్ కు అనుమతిచ్చింది.
జానీ మాస్టర్ ని తిరిగి మళ్లీ అక్టోబర్ 3న కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సిన సినిమాలు ఏవైనా ఉంటే? ఆ అవకాశాలు కోల్పోయినట్లే. ప్రస్తుతం అతడి చేతిలో కొన్ని సినిమాలున్నట్లు తెలుస్తోంది.