Begin typing your search above and press return to search.

మొన్న దిష్టి తీసి హారతి.. నేడు సన్మానం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Feb 2025 9:30 PM GMT
మొన్న దిష్టి తీసి హారతి.. నేడు సన్మానం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!
X

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయిన ఆయన.. జైలు పాలయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ కొంత కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. అయితే కేసు వల్ల పలు అవకాశాలు ఆయన మిస్ చేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ కెరీర్ లో బిజీగా మారుతున్నారు జానీ మాస్టర్. రీసెంట్ గా కన్నడ మూవీలో అవకాశం అందుకున్నారు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్ లీడ్ రోల్స్ లో డెబ్యూ డైరెక్టర్ ఏఆర్ విఖ్యాత్ తెరకెక్కిస్తున్న యువర్స్ సిన్సియర్ లీ రామ్ సినిమాకు గాను ఆయన వర్క్ చేశారు.


ఇప్పుడు తన వర్క్ కంప్లీట్ చేసుకున్న జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "అత్యంత వినయపూర్వకమైన, ప్రతిభావంతులైన వారితో పని చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. యువర్స్ సిన్సియర్ లీ రామ్ కోసం గణేష్ సర్, నిష్వికా నాయుడు గారితో పనిచేయడం హ్యాపీ" అని తెలిపారు.

"దర్శకుడు విఖ్యాత్ సర్, నిర్మాత సత్య రాయల సర్ తో పాటు షూటింగ్ అంతటా నన్ను ఎంతో ఆదరించిన, ప్రేమించిన బృందానికి ధన్యవాదాలు. బ్లాక్ బస్టర్ విజయం కోసం ఎదురు చూస్తున్నాను" అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు. ఆ సమయంలో కొన్ని పిక్స్ కూడా షేర్ చేశారు. అందులో జానీ మాస్టర్ కు సన్మానం చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. క్యాస్టింగ్ తో మాట్లాడిన పిక్స్ కూడా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం జానీ మాస్టర్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో యువర్స్ సిన్సియర్ లీ రామ్ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు జానీ మాస్టర్ కు ఊహించని స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌ కు గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌ లోకి ఆహ్వనించారు.

ఆ తర్వాత కేక్ కట్ చేయించి జానీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు షూట్ కంప్లీట్ అయ్యాక దిగిన పిక్స్ ను కూడా షేర్ చేశారు. మొత్తానికి జానీ మాస్టర్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.